CBI | IAS శ్రీలక్ష్మిపై.. సుప్రీంకు సీబీఐ

ఓబుళాపురం గనుల కేసులో దూకుడు CBI | విధాత: ఓబుళాపురం గనుల కేసులో నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో సీబీఐ దూకుడు పెంచింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గనుల కేటాయింపులో మైనింగ్ కంపెనీకి ఆయాచిత లబ్ధి కలిగించారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె, జగన్ కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్నా సిమెంట్స్ కు అక్రమంగా లబ్ధి […]

  • Publish Date - August 24, 2023 / 12:49 AM IST

  • ఓబుళాపురం గనుల కేసులో దూకుడు

CBI |

విధాత: ఓబుళాపురం గనుల కేసులో నమోదు చేసిన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో సీబీఐ దూకుడు పెంచింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

గనుల కేటాయింపులో మైనింగ్ కంపెనీకి ఆయాచిత లబ్ధి కలిగించారని శ్రీలక్ష్మిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆమె, జగన్ కేసుల్లోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పెన్నా సిమెంట్స్ కు అక్రమంగా లబ్ధి చేకూర్చిన కేసులో జగన్ తోపాటు నిందితురాలిగా ఉన్నారు.

ఈ కేసులో జగన్, ప్రతాప్ రెడ్డి, ధర్మాన, సబితతో పాటు శ్రీలక్ష్మి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది.

ఉమ్మడి ఏపీలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శిగా సుదీర్ఘకాలంపాటు పనిచేసిన శ్రీలక్ష్మి.. గాలి జనార్ధన్ రెడ్డి కంపెనీకి లైసెన్సుల మంజూరులో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

2011లో అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంలో సీబీఐ పిటిషన్ తో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకుంది. శ్రీలక్ష్మితో పాటు మరికొందరికి ఉచ్చు బిగుసుకోనున్నట్లు తెలుస్తోంది.

Latest News