Site icon vidhaatha

ఆ ప్రకటనలు వెంటనే నిలిపివేయాలని సీఈఓ ఆదేశాలు

విధాత: రాజకీపార్టీలు ఎన్నికల సందర్భంగా చేస్తున్న 15 ప్రకటనలను నిలిపి వేయాలని సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని చానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు లేఖ రాశారు.

అసెంబ్లీ సాధారణ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు.

ఇష్టానుసారంగా మార్చి ప్రసారం చేస్తూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘిస్తున్న కారణంగా ఆ ప్రకటనలను రద్దు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం.సదరు ప్రకటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు, క్లిప్ లను కూడా జతపరచిన సీఈఓ కార్యాలయం.

Exit mobile version