Chandrababu | చంద్రబాబుని నిలదీసిన తెలుగు తమ్ముళ్లు!

Chandrababu విధాత‌: చంద్రబాబు నాయుడికి ఈరోజు తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ గట్టిగా తగిలింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న నూజివీడుకి చెందిన టీడీపీ కార్యకర్తలు.. తమ గోడుని బాబు ముందు వెల్లబోసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. వారి బాధల్ని బాబు వినకపోగా.. నా ముందే నిరసన తెలుపుతారా? అంటూ వారి నోరు మూయించే ప్రయత్నం చేశాడు. దాంతో రెచ్చిపోయిన కార్యకర్తలు బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఇది పార్టీ కార్యాలయం […]

  • Publish Date - July 20, 2023 / 04:18 PM IST

Chandrababu

విధాత‌: చంద్రబాబు నాయుడికి ఈరోజు తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ గట్టిగా తగిలింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న నూజివీడుకి చెందిన టీడీపీ కార్యకర్తలు.. తమ గోడుని బాబు ముందు వెల్లబోసుకునేందుకు ప్రయత్నించారు.

కానీ.. వారి బాధల్ని బాబు వినకపోగా.. నా ముందే నిరసన తెలుపుతారా? అంటూ వారి నోరు మూయించే ప్రయత్నం చేశాడు. దాంతో రెచ్చిపోయిన కార్యకర్తలు బాబుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఇది పార్టీ కార్యాలయం అనుకుంటున్నారా..? ఇంకేమన్నా అనుకుంటున్నారా? అంటూ ఒంటికాలిపై లేచాడు.

ఏం చేయాలో నాకే చెప్తారా?

నూజివీడులో గత కొన్నిరోజులుగా పార్టీలో జరుగుతున్న అంతర్గత పోరు గురించి కార్యకర్తలు.. ఈరోజు బాబుకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ.. చంద్రబాబు మాత్రం అహంకారంగా నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు అంటూ వారిపై చిందులు వేశాడు.

వాస్తవానికి నూజివీడు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వ రరావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ పార్టీలో అసమ్మతి మొదలైంది. ఆ వర్గం వారు చంద్రబాబుని కలిసి తమ నిరసన తెలియజేశారు. కానీ బాబు మాత్రం నాకు అన్నీ తెలుసు వెళ్లండి అంటూ వార్నింగ్ ఇచ్చాడు.

పార్టీలో కొత్త పోకడలేంటి?

తెలుగు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ తగలడంతో చంద్రబాబు షాక్ అయిపోయాడు. పార్టీలో ఈ కొత్త పోకడలేంటి? అంటూ కోపంతో ఊగిపోతూ కార్యకర్తల్ని తిట్టాడు. దాంతో మరింతగా రెచ్చిపోయిన కార్యకర్తలు.. మా నాయకుడ్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారు? అంటూ చంద్రబాబుని నిలదీశారు. దాంతో సమాధానం చెప్పలేకపోయిన బాబు.. ఒకరిద్దరు లోపలికి రండి అంటూ పార్టీ ఆఫీస్ లోపలికి నెమ్మదిగా జారుకున్నాడు.

బుర్రలేని ఆలోచనలతో తలనొప్పి

టీడీపీ ఇటీవల ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో కార్యకర్తల మధ్య విభేదాల్ని సృష్టిస్తోంది. సత్తెనపల్లి ఇన్‌చార్జిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై కూడా ఇలానే కార్యకర్తలు పార్టీకి ఎదురు తిరిగారు. ఇప్పుడు నూజివీడులో కూడా కార్యకర్తలు పార్టీకి దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ చంద్రబాబు ఒత్తిడిలో తికమకగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీని మరింత నాశనం చేస్తున్నాడని టీడీపీ నేతలే పెదవి విరుస్తున్నారు.

Latest News