Chandrayaan-3 | ‘చంద్రయాన్‌-3’ కీలక ఘట్టం పూర్తి.. విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి

Chandrayaan-3 | విధాత, బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3).. తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.. ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, 'ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య'లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది. ఈ మేరకు 'చంద్రయాన్‌-3'ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని […]

  • Publish Date - August 5, 2023 / 05:58 PM IST

Chandrayaan-3 |

విధాత, బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రయోగించిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3).. తన ప్రయాణంలో కీలక ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది..

ఇప్పటి వరకు భూమి చుట్టూ కక్ష్యలను పూర్తిచేసుకుని, ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లో జాబిల్లివైపు దూసుకెళ్లిన ఈ వ్యౌమనౌక.. ఇకనుంచి చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టనుంది.

ఈ మేరకు ‘చంద్రయాన్‌-3’ని చందమామ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ (Lunar Orbit Insertion)ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)’ నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది..

‘చంద్రయాన్‌-3’ని జులై 14న ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు.

ఇలా 18 రోజుల వ్యవధిలో దశలవారీగా అయిదుసార్లు కక్ష్యను పెంచారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం.. జాబిల్లి దిశగా ఆగస్టు 1న ‘ట్రాన్స్‌ లూనార్‌ కక్ష్య’లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే శనివారం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

ఇదిలా ఉండగా.. ఈ వ్యోమనౌక తన ప్రయాణంలో మూడింట రెండొంతులు ఇప్పటికే పూర్తి చేసుకుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెట్టనుంది.