Site icon vidhaatha

Chattisgarh | 15 కోట్ల స్కాం.. బీజేపీ నేత అరెస్ట్‌

Chattisgarh

రాయ్‌పూర్‌: జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో 15 కోట్ల కుంభకోణానికి పాల్పడిన ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ నేతను పోలీసులు సోమవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. దుర్గ్‌ జిల్లాలో ప్రీతిపాల్‌ బేల్‌చందన్‌ బీజేపీ ముఖ్య నేతగా ఉన్నారు. 2014 నుంచి 2020 వరకు ఆయన దుర్గ్‌ డీసీసీబీ చైర్మన్‌గా వ్యవహరించారు.

2008లో దుర్గ్‌ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. డీసీసీబీ అధ్యక్షుడి ఉన్న సమయంలో 15 కోట్లకుపైగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో బ్యాంకు సీఈవో పంకజ్‌ సోఢీ రెండేళ్ల క్రితమే ఆయనపై కేసు నమోదు చేశారు.

బ్యాంకు నిర్వహణ కమిటీ అనుమతి లేకుండానే బేల్‌చందన్‌ నిధులను దుర్వినియోగం చేశాడని తన ఫిర్యాదులో సోఢీ పేర్కొన్నారు. రెండేళ్ల తర్వాత పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అంతకుముందు ఆయన ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలించలేదు.

అప్పీల్‌ను పరిశీలించిన జిల్లా మేజిస్ట్రేట్‌ ఇది 420, 409, 467, 471, 34 సెక్షన్ల కింద నమోదు అయిన కేసు అని పేర్కొంటూ అప్పీలును కొట్టివేశారు. దీంతో బేల్‌చందన్‌ను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్టు చేశారు.

Exit mobile version