CM Jagan | మీరే నా సైన్యం.. బలం.. బలగం! వలంటీర్లపై జగన్ ప్రశంసలు!!

CM Jagan విధాత‌: మొత్తానికి జగన్ తేల్చేశారు.. మీరే నా సైన్యం అంటూ వలంటీర్లను పొదుపుకున్నరు.. ఎవరు ఏమనుకున్నా మీరే నా బలం.. బలగం అని ఓపెన్ గా చెప్పేశారు. మీరే మన ప్రభుత్వానికి వారధులు సారధులు. వాళ్ళే ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. వారే మంచిని జనాల వద్దకు మోసుకెళ్ళే సత్య సారధులు అని జగన్ వారిని ప్రశంసలతో ముంచెత్తారు. వాలంటీర్ల వ్యవస్థ అంటే మంచి చేసేది అంటూ ఇంత గొప్ప సేవకుల మీద కూడా […]

  • Publish Date - May 20, 2023 / 01:58 AM IST

CM Jagan

విధాత‌: మొత్తానికి జగన్ తేల్చేశారు.. మీరే నా సైన్యం అంటూ వలంటీర్లను పొదుపుకున్నరు.. ఎవరు ఏమనుకున్నా మీరే నా బలం.. బలగం అని ఓపెన్ గా చెప్పేశారు. మీరే మన ప్రభుత్వానికి వారధులు సారధులు. వాళ్ళే ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్తున్నారు. వారే మంచిని జనాల వద్దకు మోసుకెళ్ళే సత్య సారధులు అని జగన్ వారిని ప్రశంసలతో ముంచెత్తారు.

వాలంటీర్ల వ్యవస్థ అంటే మంచి చేసేది అంటూ ఇంత గొప్ప సేవకుల మీద కూడా ప్రతిపక్ష చంద్రబాబు విషం కక్కడం ఘోరం అని అవేదన చెందారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి మంచి పని కూడా వాలంటీర్లు చేతుల మీదనే ప్రజల వద్దకు చేరుతుందని అన్నారు. అత్యుత్తమ సేవలు అందిస్తున్న 2.3లక్షల మంది వాలంటీర్లకు సేవ మిత్ర, సేవ రత్న..సేవ వజ్ర అవార్డులు అందజేసిన జగన్ ఈ సందర్భంగా వారి సేవలను ప్రస్తుతించారు.

పేదలు, వృద్ధులకు కచ్చితంగా ఒకటవ తేదీన ప్రతీ ఇంటి గడప వద్దకు వచ్చి సూర్యుడు కూడా లేవకముందే పెన్షన్ అందించే వాలంటీర్ నిజంగా గొప్పవాడే అని జగన్ అన్నారు. అలాంటి వాలంటీర్ల మీద చంద్రబాబు విషం కక్కారని, ప్రతీ ఇంటీ డోర్ ఎందుకు తడుతున్నారంటే అని దుర్మార్గంగా మాట్లాడారని జగన్ అన్నారు. ఇపుడు ఈ వ్యవస్థ ప్రజల మన్ననలు అందుకుంటోందని భావించి తాను అధికారంలోకి వస్తే జన్మ భూమి కమిటీలలో పనిచేసిన వారినే వాలంటీర్లుగా పెడతానని అంటున్నారని జగన్ విమర్శించారు.

అంతే కాకుండా చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత మీదే అంటూ ఓ సూచన చేస్తూ చంద్రబాబు వస్తే వాలంటీర్లను తొలగిస్తారు అని ఎలర్ట్ చేశారు. మీరు ప్రభుత్వానికి కళ్ళూ చెవులు లాంటి వారు మీతోనే ప్రభుత్వం ఉంది అని మెచ్చుకున్నారు.

అంతే కాకుండా తనకు అనుకూల మీడియా లేదని తనకు ఉన్న ఆస్తి అంతా వాలంటీర్లు మాత్రమే అని జగన్ అంటూనే ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత కూడా మీదే అని అన్నారు. మొత్తానికి వలంటీర్లు అందరూ నా కుటుంబీకులు అని చెబుతూ వారి కుటుంబాలను దగ్గరకు తీసుకున్న నమ్మకం కలిగించారు. ఇప్పుడు వారంతా ఏమోషనల్ గా కూడా జగన్ తో కనెక్ట్ అయ్యారని అంటున్నారు.

Latest News