CM Kejriwal | సుప్రీంకోర్టునూ ప్ర‌ధాని మోదీ న‌మ్మడం లేదు: సీఎం కేజ్రీవాల్

CM Kejriwal అందుకే సీఈసీ, ఈసీ నియామ‌క బిల్లు తెచ్చారు ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఫైర్‌ CM Kejriwal | దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని (Supreme Court ) కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి న‌మ్మ‌డం లేద‌ని ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) విమ‌ర్శించారు. సుప్రీంకోర్టు జారీచేసే ఉత్త‌ర్వు న‌చ్చ‌క‌పోయినా పార్లమెంటులో చట్టం తెచ్చి తాను అనుకున్న‌ది సాధించుకున్నార‌ని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధ‌గా చీఫ్ ఎల‌క్ష‌న్ […]

  • Publish Date - August 10, 2023 / 12:07 PM IST

CM Kejriwal

  • అందుకే సీఈసీ, ఈసీ నియామ‌క బిల్లు తెచ్చారు
  • ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఫైర్‌

CM Kejriwal | దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని (Supreme Court ) కూడా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి న‌మ్మ‌డం లేద‌ని ఆప్ క‌న్వీన‌ర్‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ (CM Kejriwal) విమ‌ర్శించారు. సుప్రీంకోర్టు జారీచేసే ఉత్త‌ర్వు న‌చ్చ‌క‌పోయినా పార్లమెంటులో చట్టం తెచ్చి తాను అనుకున్న‌ది సాధించుకున్నార‌ని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల‌కు విరుద్ధ‌గా చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌తోపాటు ఇత‌ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ల నియామ‌కానికి కూడా ప్ర‌ధాని మోదీ పార్ల‌మెంట్ బిల్లును ప్రతిపాదించార‌ని చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న గురువారం ట్వీట్‌చేశారు.

@దేశ అత్యున్నత న్యాయస్థానంపై ప్రధాని మోదీ (PM Modi)కి నమ్మకం లేదని నేను ఇంతకు ముందే చెప్పాను. సుప్రీంకోర్టు ఇచ్చే ఏ ఉత్తర్వు తనకు నచ్చకపోయినా, పార్లమెంటులో చట్టం తెచ్చి దానిని తిప్పికొడతార‌ని చెప్పాను. ప్ర‌ధాని మోదీ అచ్చం అలాగే చేస్తున్నారు. ప్ర‌ధాన మంత్రి సుప్రీంకోర్టు ఆదేశాల‌ను అంగీకరించకపోతే దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది.

నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు నిష్పాక్షిక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతూ, మోదీ తన నియంత్రణలో ఉండే ఒక కమిటీని ఏర్పాటు చేసి, దాని ద్వారా తనకు నచ్చిన వ్యక్తిని ఎన్నికల కమిషనర్ (Election Commissioner)గా నియమించుకోవాల‌ని చూస్తున్నారు. ఈ మేర‌కు పార్లమెంట్‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ఇది ఎన్నికల నిష్పాక్షికతను ప్రభావితం చేస్తుంది. ప్రధాని త‌న వ‌రుస‌ నిర్ణయాలతో భారత ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.* అని మండిప‌డ్డారు.

Latest News