విధాత : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గురువారం సీఎం రేవంత్‌రెడ్డి తాజ్ ఫలక్‌నుమాలో సీజేఐ చంద్రచూడ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. నూతన హైకోర్టు భవన నిర్మాణం..మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారని సమాచారం.