Site icon vidhaatha

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రత్యేక ప్రణాళికలు: సీఎం రేవంత్‌రెడ్డి

విధాత : రాజ్యంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్‌ ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారన్నారు. రాజ్యంగ నిర్మాతగా దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావి తరాలకు స్పూర్తిగా నిలిచిన గొప్ప దార్శనికుడన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు బడుగు, బలహీన వర్గాాలు, దళిత, గిరిజనుల అభివృద్ధి తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌, స్థానిక నాయకులు విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన భట్టి విక్రమార్క

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయ సాధనకు అంబేద్కర్ చేసిన కృషి నిరంతరం అనుసరణీయమన్నారు. అంబేద్కర్ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల అభ్యున్నతికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందన్నారు.

Exit mobile version