Nagam Janardhan Reddy | కాళేశ్వరం అవినీతిపై కాగ్‌కు ఫిర్యాదు: మాజీ మంత్రి నాగం

Nagam Janardhan Reddy | సీఎం కేసీఆర్ ఒక చీడ పురుగు విధాత, హైద్రాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, ప్రాజెక్టు అవినీతిపై ఢిల్లీ కాగ్‌కు ఫిర్యాదు చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఒక అవినీతి చెద పురుగులా తయారై రాష్ట్ర వనులను దోచుకుంటున్నారన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 48000 కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాగ్ రిపోర్టర్ ని అసెంబ్లీలో ఎందుకు […]

  • Publish Date - August 17, 2023 / 01:39 PM IST

Nagam Janardhan Reddy |

సీఎం కేసీఆర్ ఒక చీడ పురుగు

విధాత, హైద్రాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, ప్రాజెక్టు అవినీతిపై ఢిల్లీ కాగ్‌కు ఫిర్యాదు చేస్తానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఒక అవినీతి చెద పురుగులా తయారై రాష్ట్ర వనులను దోచుకుంటున్నారన్నారు.

ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ లోనే 48000 కోట్లు అవినీతి జరిగిందన్నారు. కాగ్ రిపోర్టర్ ని అసెంబ్లీలో ఎందుకు పెట్టలేదని నాగం మండిపడ్డారు. దీనిపై సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కాంగ్రెస్ ఎంపీలు తాడోపేడో తేల్చుకోవాలన్నారు. కర్ణాటకలో 40శాతం కమిషన్ కంటే తెలంగాణలో 70శాతం కమిషన్ సాగుతుందని దీనిపై కాంగ్రెస్ పోరాడాలన్నారు. ఇటలీలో మెగా కృష్ణా రెడ్డి వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని, అక్కడ దివాళా తీసిన కంపెనీ తో సీఎం కేసీఆర్ ఒప్పందం పెట్టుకుని రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మింపచేస్తున్నారని ఆరోపించారు.

తనకు గాంధీభవన్‌కు దూరం పెరగలేదన్నారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, ఐదేళ్లుగా నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్‌ను కాపాడుకుంటు వస్తున్నానని, పార్టీలో చేరిన జూపల్లి, ఇంకా చేరని కె.దామోదర్‌రెడ్డిలు ఇప్పుడొచ్చి తమకే టికెట్ అంటున్నారన్నారు.

ఎన్నికల్లో గెలిచాకా వారు బీఆరెస్‌లో చేరరన్న గ్యారంటీ ఏమిటన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్‌ను కాదని, రాజకీయాల్లో మాత్రమే సీనియర్ అని, అందరు టికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే నేను కూడా దరఖాస్తు చేసుకుంటానన్నారు.

Latest News