Site icon vidhaatha

CS Shanti Kumari | సెప్టెంబర్ 1న.. స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు: సీఎస్‌

CS Shanti Kumari |

విధాత, హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను సెప్టెంబర్ 1న హెచ్ఐసీసీలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియజేశారు. ఏర్పాట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంగళవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణ చారి, దేశపతి శ్రీనివాస్, డీజీపీ అంజనీ కుమార్లతో సహా పలువురు కార్యదర్శులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఉత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నా రన్నారు. కార్యక్రమంలో దేశ భక్తి, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. వజ్రోత్సవ ముగింపు వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సంబంధిత అధికారులందరూ విస్తృత స్థాయిలో ఏర్పాట్లను చేయాలని సూచించారు.

సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శైలజా రామయ్యర్, సందీప్ సుల్తానియా, జితేందర్, కార్యదర్శులు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ రోనాల్డ్ రోస్, ఫైర్ సర్వీసుల డీజీ నాగిరెడ్డి, సమాచార పౌర సంబంధాల స్పెషల్ సెక్రెటరీ అశోక్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎండీ నర్సింహా రెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ పమేలా సత్పతి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.

Exit mobile version