విధాత : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆస్థాన వేదిక మండపం వేదికగా జరుగనున్న ఈ ధార్మిక సదస్సుకు దేశంలోని 57మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు హాజరుకాబోతున్నారన్నారు. ధార్మిక అంశాలపై చర్చించి చివరి రోజు తీర్మానాలు చేయడం జరుగుతుందని తెలిపారు. హిందూ ధర్మప్రచారం, పరిరక్షణ, సనాతన హిందూ ధర్మవిలువల వ్యాప్తి, విశిష్టతను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలు, సలహాలపై సదస్సులో చర్చించనున్నారు. పీఠాధి, మఠాధిపతులకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ముగ్గురు సీనియర్ అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఒకో స్వామిజీకి ఒక లైజన్ అధికారిని నియమించారు. దర్శనం, వసతి, ఆహారం, రవాణా వంటి కమిటీలతో లైజన్ అధికారి సమన్వయం చేసుకుని స్వామిజీలకు తగిన ఏర్పాట్లు చేస్తారు.
తిరుమలలో నేటీ నుంచి ధార్మిక సదస్సు
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహించనున్నట్లుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు
Latest News

పిల్లలు కావాలంటే నీ భార్యను నా వద్దకు పంపు : టీసీఎస్ నాశిక్ టీమ్ లీడ్ దారుణ వ్యాఖ్యలు
నెలాఖరులో పెట్రో మంటలు తప్పవా?
వేం నరేందర్రెడ్డి ప్రమాణ కార్యక్రమానికి ఆ మంత్రి ఎందుకు రాలేదు?
బాలీవుడ్లోకి సాయి పల్లవి ఎంట్రీ…
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు మరోసారి అవమానం! మళ్లీ రగలిన సెంటి‘మంటలు’
తెలంగాణ ప్రజలకు తేజస్వీ క్షమాపణలు చెప్పాలి : మంత్రి పొన్నం
డీలిమిటేషన్ బిల్లుతో ఉత్తరాదికి ఆధిపత్యం... దేశంలో చీలిక : మేధావుల ఆందోళన
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వీ వ్యాఖ్యలు : హరీశ్, కేటీఆర్ ఫైర్
రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది : మాజీ మంత్రి మోత్కుపల్లి
కొత్త పార్టీ సన్నాహాలు...కాశీలో కవిత పూజలు