హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి.. మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది అని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హెచ్చరించారు. మా మాదిగలకు జరిగే అవమానాలు భరించే ఓపికా, సహనం ఇక లేదన్నారు. నీ వెనుక గోతులు తవ్వుతున్నది ఎవరో నీవు గుర్తించుకోవాలన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగిపోయాక కూడా దానికి వ్యతిరేకంగా సమావేశాలు పెడితే పార్టీ నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గురువారం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి చేస్తున్న ఒక్క మంత్రి మీదైనా చర్యలు తీసుకున్నవా? అని సీఎం రేవంత్ రెడ్డిని మోత్కుపల్లి ప్రశ్నించారు. ఒక మంత్రి అయితే 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నాడు అని బహిరంగంగా చర్చ నడుస్తుందన్నారు. 10శాతం మంత్రి ఎవరంటే ఆయన పేరు సాధారణ ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. అవినీతిపరులైన మంత్రి ఎస్సీ, బీసీ లేక ఇంకేవరైతే ఏమిటని ప్రశ్నించారు. అటువంటి అవీనితి మంత్రిని ఎందుకు మంత్రివర్గం నుంచి తీసిపారేయడం లేదని నిలదీశారు. ఎంతసేపు నీకు నీ సీఎం పదవే ముఖ్యమా? మీ ప్రభుత్వం ఉండాలన్నా కూడా ప్రజల్లో మంచిపేరు ఉండాలి కదా? అని గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి :
కొత్త పార్టీ సన్నాహాలు…కాశీలో కవిత పూజలు
దేశ చరిత్రలో మహిళ రిజర్వేషన్ బిల్లు కీలక ఘట్టం: ప్రధాని మోదీ
