విధాత: వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువ కథానాయకుడు సుహాస్ (Suhas). ఆయన ‘ఓ భామ అయ్యో రామ’ (Oh Bhama Ayyo Rama) అంటూ మరోసారి అందమైన ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. మలయాళ నటి (జో ఫేమ్) మాళవిక మనోజ్(Malavika Manoj) కథానాయికగా తెలుగు తెరకు పరిచయమవుతోంది. రామ్ గోధల (Ramu Godhala) ఈ సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తుండగా వీఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుండడం విశేషం.
ఇతదిలాఉండగా ఈ చిత్రంలో ప్రముఖ మాస్ దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) ఓ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో ఆయన గెస్ట్ రోల్ అందరిని సర్‌ఫ్రైజ్ చేయనుంది. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ హరీష్ శంకర్ (Harish Shankar)ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ‘సుహాస్ కెరీర్‌కు మైలురాయిగా నిలిచే చిత్రంగా ఇది ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఓ బెస్ట్ క్వాలిటీ సినిమాను అందించబోతున్నాం. ఈ చిత్రంలో సున్నితమైన ప్రేమ భావోద్వేగాలతో పాటు అంతకు మించిన ఫన్ ఉంటుంది. అడ్గగానే మా చిత్రంలో అతిథి పాత్రను చేసినందుకు హరీష్ శంకర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వేసవిలో మా ఈ ఓ భామ అయ్యో రామ చిత్రంలోని వినోదం ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉందన్నారు. అత్యుత్తమ సాంకేతిక బృందం పనిచేస్తోన్న ఈ చిత్రంలో నువ్వు నేను ఫేం అనిత (Anita), కమెడియన్ అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మనికందన్ సినిమాటోగ్రఫీ చేయగా, రధన్ (Radhan) సంగీతాన్ని అందిస్తున్నారు. భవిన్ షా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టగా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్‌గా చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.