Site icon vidhaatha

Rajanna Sirisilla: శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తుండ‌గా కుక్క‌ల దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

విధాత, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీవండికి చెందిన కుసుమ లక్ష్మి (50), ఎలగందుల గ్రామానికి చెందిన చరణ్ తేజ్ (5) ఈ దాడిలో గాయపడ్డారు. స్థానికులు వీరిని కుక్కల నుండి కాపాడి, ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు.

బోయినపల్లిలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతున్న క్రమంలో పిచ్చి కుక్కలు వీరిపై దాడి చేశాయి. ఇటీవలి కాలంలో మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాలలో కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో మనుషులపై దాడి చేస్తున్న కుక్కలను నియంత్రించాలని, వాటి నుండి రక్షణ కల్పించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Exit mobile version