విధాత: ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (ఎంఐఏల్)కు గురువారం బెదిరింపు ఇ మెయిల్ వచ్చింది. ‘బిట్‌కాయిన్‌లో ఒక మిలియన్ డాలర్లు పేర్కొన్న చిరునామాకు బదిలీ చేయకపోతే మేము 48 గంటల్లో టెర్మినల్ 2ని పేల్చివేస్తాం’ అని మెయిల్‌లో అగంతకుడు హెచ్చరించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గురువారం ఉదయం 11:06 గంటలకు, ఎంఐఏల్‌వారి feedback.bom@aani.com ఇమెయిల్ IDకి quaidacasrol@gmail.com ఇమెయిల్ ID నుంచి ఒక ఈ మెయిల్‌ను వచ్చింది. 24 గంటల తర్వాత మరో హెచ్చరిక పంపిస్తామని కూడా అగతంకులు తెలిపారు. ఎయిర్ అధికారి హెచ్చరిక మెయిల్ గురించి భద్రతా అధికారులకు తెలిపారు. భద్రతా అధికారులు నిందితుడి ఐపీ చిరునామాను గుర్తించి అది విదేశాలకు చెందినదిగా భావిస్తున్నారు.
ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్ లిమిటెడ్ నిర్వహిస్తున్నది. feedback.bom@aani.com ద్వారా కంపెనీపై ప్రయాణికులు సలహాలు, సూచనలు, ఫిర్యాదులు సమర్పించవచ్చు. ఈ మెయిల్‌కు అగంతకుడు బెదిరింపు మెయిల్ పెట్టాడు. ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తుతెలియని వ్యక్తిపై వివిధ సెక్షన్ల కంద కేసు నమోదు చేశారు.