Site icon vidhaatha

మ‌ధురై ఎస్‌బీఐలో అగ్ని ప్ర‌మాదం

విధాత‌: త‌మిళ‌నాడు మ‌ధురైలోని ఎస్‌బీఐశాఖ‌లో శ‌నివారం తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం చోటుచేసుకున్న‌ది. బ్యాంకు నుంచి పొగ‌లు రావడాన్ని తొలుత పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది రాత్రి 3 గంటల ప్రాంతంలో గ‌మ‌నించారు. అగ్నిమాప‌క సిబ్బందికి, బ్యాంకు వారికి సైతం స‌మాచారం అందించారు. మధురై పెరియార్ బ‌స్టాండ్ స‌మీపంలోని ఎస్‌బీఐ శాఖ‌లో ఇలా అక‌స్మాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.

పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. భారీ ఎత్తున చెల‌రేగుతున్న మంట‌ల‌ను ఆర్పివేస్తున్నారు. అగ్నిమాప‌క శ‌క‌టాలు మంటలు ఆర్పే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాయి. ప్ర‌మాదానికి గల కార‌ణాలు ఇంకా తెలియ‌రాలేదు. అలాగే, ఎంత మేర‌కు న‌ష్టం జ‌రిగింది, న‌గ‌దు ఏమైనా కాలిపోయిందా? అనేది తెలియాల్సి ఉన్న‌ది. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు

Exit mobile version