నాడు ఎల్లగొట్టిన్రు.. నేడు ఎల్లిపోతున్నారు

బీఆరెస్ నుంచి సాగుతున్న వరుస వలసలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీటర్ వేదికగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు


విధాత, హైదరాబాద్ : బీఆరెస్ నుంచి సాగుతున్న వరుస వలసలపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి ట్వీటర్ వేదికగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ మొదటి సెక్రటరీ జనరల్ విజయశాంతిని, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ కారణం చూపక, కనీసం షోకాజ్ సైతం ఇయ్యక పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒకప్పుడు ఎల్లగొట్టిన్రు అని గుర్తు చేశారు.


ఇయ్యాల్టీ బీఆరెస్‌ సెక్రటరీ జనరల్ కేశవరావు ఆత్మగౌరవ రీత్యా ఆ పార్టీకి దూరం కానున్నారని, తప్పులేడ జరిగినయో, అందరెందుకు దూరమైతున్నరో, కేసీఆర్ తన ప్రభావం తానే ఏ కారణాలతో రోజు రోజుకి కోల్పోతున్నరో వారే విశ్లేషించుకోవటం అవసరమని వ్యాఖ్యానించారు.

Latest News