ఇంటర్ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్.. ఆల‌స్యంగా వెలుగులోకి!

<p>మొన్న దయానంద్ కాలనీలో మైనర్ బాలికపై రాఘవాపురంలో మైనర్ బాలిక పై గతంలో యువతి పైన లైంగికదాడికి యత్నం వరంగల్లో వరుస సంఘటనలతో భయాందోళన విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినిని నమ్మించి గ్యాంగ్ రేప్‌కుకు పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలోని దయానంద్ కాలనీలో ఇటీవల దళిత మైనర్ బాలికపై అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మరవకముందే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం రాఘవపూర్‌లో […]</p>

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ నగరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినిని నమ్మించి గ్యాంగ్ రేప్‌కుకు పాల్పడిన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ నగరంలోని దయానంద్ కాలనీలో ఇటీవల దళిత మైనర్ బాలికపై అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడిన సంఘటన మరవకముందే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం రాఘవపూర్‌లో మరో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. వరుస ఘటనలతో ఆందోళన వ్యక్తం అవుతుంది.

తాజాగా ఇంటర్ విద్యార్థినిపై

ఇంటర్ చదివే విద్యార్థినిపై ప్రియుడు, మరో ఇద్దరు యువకులు బెదిరించి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరం లోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన పదహారేళ్ల విద్యార్థిని కొంతకాలంగా నర్సంపేటకు చెందిన సెల్ఫోన్ మెకానిక్ దూడల ప్రభాస్‌తో ప్రేమ వ్యవహారం సాగిస్తోంది.

మంగళవారం కళాశాలకు వెళ్తున్నానని ఆమె ప్రభాస్‌తో కలిసి ఖిలావరంగల్‌కు వెళ్లింది. ప్రభాస్ తన స్నేహితులకు ఫోన్ చేసి పిలిపించి ఆమెతో నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి ఆమెపై
అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ విషయమై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

వరుస సంఘటనలు

ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా జరుగుతున్న లైంగిక దాడి సంఘటనలతో ఆడపిల్లలు, త‌ల్ఇదండ్ర‌లు భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు, మైనర్ బాలికలు, యువతులు అనే తేడా లేకుండా లైంగిక దాడికి గురవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి.

దయానంద్ కాలనీలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంఘటనలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక కొద్దిరోజుల క్రితం హనుమకొండలోని ఒక ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్న యువతి పైన కొందరు యువకులు అత్యాచారయత్నానికి పాల్పడగా సదరు యువతి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Latest News