Site icon vidhaatha

జూలో గుండెపోటుకు గురైన భ‌ర్త‌.. త‌ట్టుకోలేక భ‌వ‌నంపై నుంచి దూకి భార్య ఆత్మ‌హ‌త్య‌

విధాత: ఇది హృద‌య‌విదార‌క ఘ‌ట‌న‌. భ‌ర్త గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. భ‌ర్త మ‌ర‌ణానాన్ని త‌ట్టుకోలేక‌.. 24 గంట‌ల్లోపే భార్య ఏడో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఘ‌జియాబాద్‌కు చెందిన అభిషేక్‌(25), అంజ‌లి దంప‌తులు సోమ‌వారం ఢిల్లీలోని జూపార్కుకు వెళ్లారు. జూపార్కులో ఉండ‌గానే అభిషేక్ గుండెపోటుకు గుర‌య్యాడు. దీంతో అత‌న్ని త‌న స్నేహితుల స‌హాయంతో అంజ‌లి ఆస్ప‌త్రికి తీసుకెళ్లింది. మొద‌ట గురు తేగ్ బ‌హ‌దూర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి స‌ఫ్ద‌ర్‌జంగ్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ అత‌ను ప్రాణాలు కోల్పోయాడు.

భ‌ర్త మృతి చెంద‌డంతో.. అంజ‌లి తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఆమె కూడా ఘ‌జియాబాద్‌లోని తాము ఉంటున్న భ‌వ‌నంలోని ఏడో అంత‌స్తు నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ మృతి చెంద‌డం.. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. అభిషేక్‌, అంజ‌లికి గ‌తేడాది నవంబ‌ర్ 30వ తేదీన వివాహ‌మైంది. పెళ్లైన మూడు నెల‌ల‌కే వీరు అనంత‌లోకాల‌కు వెళ్లడం ఇరు కుటుంబాల‌ను విషాదంలోకి నెట్టింది.

Exit mobile version