Gold Rates | మగువలకు బంగారం ధరలు ఊరటనిస్తున్నాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే, వెండి ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,490 నిలకడగా ఉన్నది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.64,090 వద్ద స్థిరంగా ఉన్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,490 వద్ద ట్రేడవుతున్నది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,640 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.58,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,490 పలుకుతున్నది.
ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. రూ.200 పెరిగి కిలో బంగారం ధర రూ.79,200కు పెరిగింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80,700కు పెరిగింది. అదే సమయంలో ప్లాటినం ధర తగ్గుముఖం పట్టింది. తులానికి రూ.60 తగ్గి.. రూ.26,200 వద్ద ట్రేడవుతున్నది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోనూ ఇదే ధర కొనసాగుతున్నది