Gold-Silver Price | అంతర్జాతీయ మార్కెట్‌లో నెల గరిష్ఠానికి చేరిన బంగారం..! హైదరాబాద్‌లో మళ్లీ పెరిగిన పుత్తడి ధర.. తులం ఎంత పలుకుతుందంటే..?

Gold-Silver Price | ఈ నెలలో యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కాబోతున్నది. ఈ భేటీలో వడ్డీ రేట్ల సైకిల్‌లను నిలిపివేస్తుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు గరిష్ఠ స్థాయిని తాకింది. ప్రస్తుతం ఔన్స్‌కు 1,967.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. దాంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల స్వర్ణంపై రూ.100 పెరిగి.. తులానికి రూ.55,300 పలుకుతున్నది. […]

  • Publish Date - September 5, 2023 / 02:11 AM IST

Gold-Silver Price |

ఈ నెలలో యూఎస్‌ ఫెడ్‌ సమావేశం కాబోతున్నది. ఈ భేటీలో వడ్డీ రేట్ల సైకిల్‌లను నిలిపివేస్తుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు గరిష్ఠ స్థాయిని తాకింది.

ప్రస్తుతం ఔన్స్‌కు 1,967.10 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. మరో వైపు ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై సైతం పడుతున్నది. దాంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి.

22 క్యారెట్ల స్వర్ణంపై రూ.100 పెరిగి.. తులానికి రూ.55,300 పలుకుతున్నది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.100 పెరిగి రూ.60,320 వద్ద ట్రేడవుతున్నది. ఇక వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,320కి చేరింది.

చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రేటు రూ.55,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.60,650 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,320కి పెరిగింది. కోల్‌కతా నగరంలో 22 క్యారెట్ల పసిడి రూ. 55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,320 వద్ద కొనసాగుతున్నది.

బెంగళూరులో 22 క్యారెట్ల స్వర్ణం రేటు రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,320 వద్ద ట్రేడవుతున్నది. కేరళలో 22 క్యారెట్ల పుత్తడి రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,320కి పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.60,320 వద్ద కొనసాగుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేలు పలుకుతున్నది.

Latest News