Site icon vidhaatha

Governor Tamilisai | పెండింగ్‌ బిల్లులపై.. గవర్నర్‌ కీలక నిర్ణయం! ఓ బిల్లు తిరస్కరణ

Governor Tamilisai

విధాత‌: రాజ్‌భవన్‌లో పెండింగ్‌ బిల్లులపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై (Governor Tamilisai ) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 3 బిల్లులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ఒక బిల్లును తిరస్కరిస్తూ వెనక్కి పంపిన గవర్నర్‌ మిగిలి రెండింటిపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ సహా వైద్య విద్యలో పాలనాపరమైన పదవీ విరమణకు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును గవర్నర్‌ (Governor Tamilisai) తిరస్కరించారు.

పురపాలికల్లో అవిశ్వాస గడువును మూడేళ్ల నుంచి నాలుగేళ్లు పెంపు, కో-ఆప్షన్‌ సభ్యుల పెంపునకు సంబంధించిన చట్ట సవరణ బిల్లుతో పాటు, కొత్త మరిన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ.. చట్టసవరణ బిల్లుపై తమిళిసై(Governor Tamilisai) ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు నివేదించనున్నారు.

ఉభయ సభలు పాస్‌ చేసిన బిల్లులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేయకుండా జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పది బిల్లుల్లో గత విచారణ సందర్భంగా.. మూడు బిల్లులను ఆమోదించగా రెండింటిని రాష్ట్రపతికి, మరో రెండు బిల్లులపై ప్రభుత్వ అభిప్రాయం కోరినట్లు రాజ్‌భవన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

మరో మూడు బిల్లులు గవర్నర్‌ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. నేడు ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ ఉన్న నేపథ్యంలో మూడు బిల్లులపై తమిళిసై నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version