Govt Banks | వారానికి ఐదు రోజులే ప‌ని చేయ‌నున్న ప్ర‌భుత్వ బ్యాంక్‌లు..!

Govt Banks | దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ బ్యాంకుల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి ఐదు రోజులే ప్ర‌భుత్వ బ్యాంక్‌లు ప‌ని చేయ‌నున్నాయి. ఈ నిర్ణ‌యానికి త్వ‌ర‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుప‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. కేంద్రం ఆమోదం త‌ర్వాత వారానికి ఐదు రోజుల పాటే బ్యాంకు ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కానున్నారు. అయితే ఐదు రోజుల పాటు మాత్ర‌మే బ్యాంక్‌లు ప‌ని చేయ‌నున్న నేప‌థ్యంలో సిబ్బంది […]

  • Publish Date - May 4, 2023 / 02:34 AM IST

Govt Banks |

దేశ వ్యాప్తంగా ప్ర‌భుత్వ బ్యాంకుల్లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వారానికి ఐదు రోజులే ప్ర‌భుత్వ బ్యాంక్‌లు ప‌ని చేయ‌నున్నాయి. ఈ నిర్ణ‌యానికి త్వ‌ర‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుప‌నుంద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

కేంద్రం ఆమోదం త‌ర్వాత వారానికి ఐదు రోజుల పాటే బ్యాంకు ఉద్యోగులు విధుల‌కు హాజ‌రు కానున్నారు. అయితే ఐదు రోజుల పాటు మాత్ర‌మే బ్యాంక్‌లు ప‌ని చేయ‌నున్న నేప‌థ్యంలో సిబ్బంది ప్ర‌తి రోజు 40 నిమిషాలు అద‌నంగా ప‌ని చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం బ్యాంక్ ఉద్యోగులు రెండో, నాలుగో శ‌నివారాలు సెల‌వు తీసుకుంటున్నారు. ప్ర‌తీ నెలా మొద‌టి, మూడో శ‌నివారాల్లో బ్యాంక్‌లు తెరిచి ఉంటున్నాయి.

Latest News