Site icon vidhaatha

Goods To Bank Employees | బ్యాంకులకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..! ఈ ఏడాది చివరి నుంచి వారానికి రెండురోజుల వీక్లీ ఆఫ్‌..!

Goods To Bank Employees | బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఎన్నో రోజులుగా డిమాండ్‌ త్వరలోనే నెరవేరబోతున్నది. ప్రస్తుతం పలు కేంద్ర ప్రభుత్వం పలు విభాగాలతో పాటు పలు ప్రైవేటు సంస్థలు వీక్లీ 5 డేస్‌ సిస్టమ్‌ను పాటిస్తున్నాయి. శని, ఆదివారాల్లో సెలవులు ఉండనున్నాయి. ఇదే తరహాలో వారానికి రెండురోజులు వీక్లీ ఆఫ్‌ ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే బ్యాంకు అసోసియేషన్‌, ఉద్యోగ సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. ఒప్పందంపై ప్రభుత్వ ఆమోదం కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ డిమాండ్‌ ఈ ఏడాది చివరి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారానికి రెండురోజుల వీక్లీ ఆఫ్‌, 5 డేస్‌ వర్కింగ్‌పై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగ సంఘాలకు మధ్య ఒప్పందం జరగ్గా.. ఆర్థిక శాఖ ఆమోదం మాత్రమే మిగిలింది.

ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, ఉద్యోగ సంఘాల మధ్య గత ఏడాది 2023 డిసెంబర్ నెలలో ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతిపాదన కేంద్రం వద్దనే ఉన్నది. ఈ ఏడాది చివరి వరకు కేంద్రం ఈ విషయంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వబోతుందని సమాచారం. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫిడరేషన్ ఈ ఏడాది మార్చ్ 8న ఒప్పందాన్ని నిర్ధారిస్తూ జాయింట్ నోట్ సైతం విడుదల చేశాయి. తుది నిర్ణయంలో రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఉండనున్నట్లు తెలుస్తున్నది. బ్యాంకింగ్‌ పని వేళలు, ఇంటర్నల్‌ ఆపరేషన్స్‌ సమయాలను నిర్ణయించనున్నారు. వినియోగదారుల సేవల విషయంలో ఎలాంటి కోతలు ఉండబోవని సమాచారం. రోజువారీ పని దినాల్లో 40 నిమిషాలు అదనంగా పొడిగిస్తూ వారానికి ఐదురోజుల వర్కింగ్‌ డేస్‌ను ప్రారంభించనున్నారు.

ఇదే అమలులోకి వస్తే బ్యాంకులు ఉదయం 9.45 గంటలకు మొదలై.. సాయంత్రం 5.30 గంటల వరకు పని పని చేస్తాయి. వారానికి ఐదు రోజుల పనిదినాలకు అనుమతికి అడ్డంకులేమీ లేవు. అందుకంటే ప్రస్తుతం రెండు, నాలుగో శనివారాలు సెలవు ఇస్తున్న విషయం తెలిసిందే. ఎలాగూ ఆదివారం బ్యాంకులకు సెలవే. అదనంగా రెండు నుంచి మూడురోజులు మాత్రమే గరిష్ఠంగా సెలవు ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపితే.. ఆర్బీఐ నెగోషయెబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం సెక్షన్ 25 ప్రకారం.. నెలలోని నాలుగు శనివారాలు కూడా అధికారికంగా సెలవులు ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల షెడ్యూల్ అనేది ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉండనున్నది. కొత్త షెడ్యూల్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి మొదలుకానున్నట్లు అంచనా. పదేళ్ల నుంచి బ్యాంకు ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినాల కోసం పని చేస్తూ వస్తున్నారు.

Exit mobile version