Site icon vidhaatha

Harsh Goenka | ఇస్రో చీఫ్.. సోమనాథ్ జీతం అంత తక్కువ! నిజమేనా..?

Harsh Goenka

విధాత: ఇస్రో చీఫ్ సోమనాథ్ నెల జీతం ఎంత మీరు చెప్పండి నెలకు 2.5లక్షల జీతం పొందుతున్నారు. ఇది ఆయనకు సరైన జీతమేనా అంటూ ప్రముఖ వ్యాపార వేత్త హర్ష గోయెంకా పెట్టిన ట్వీట్ సామాజిక మాధ్యంలో వైరల్ మారింది. డబ్బే కాకుండా ఉన్నతమైన ఎన్నో అంశాలు సోమనాథ్ లాంటి వ్యక్తులను ప్రేరేపిస్తాయని మనం అర్ధం చేసుకోవచ్చన్నారు.

సాంకేతికత, పరిశోధనల్లో అంకితభావంతో ఆయన కృషి చేస్తున్నారని, సోమనాథ్ లాంటి వారు దేశం గర్వపడేలా చేయాలనుకుంటారని, ఆయన లాంటి వ్యక్తులకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్ననంటూ ట్వీట్ చేశారు.

ఇప్పటికే ఈ ట్వీట్‌ను లక్షల మంది వీక్షించగా ఆయన ట్వీట్‌తో ఏకీభవించిన నెటిజన్లు సోమనాథ్‌ సామర్ధ్యానికి మరింత జీతం రావాలని కొందరు, వారు సొంత సౌకర్యాల కోసం కాకుండా దేశం కోసం పనిచేసే గొప్పవారని మరికొందరు రకరకాలుగా సోమనాథ్‌ను పొగుడుతూ రీట్వీట్‌లతో ప్రతిస్పందించారు.

Exit mobile version