Site icon vidhaatha

Nagma | 48 ఏళ్ల వ‌య‌స్సులో.. ఆ కోరిక ఉందంటున్న‌ హీరోయిన్.. ఆశ్చ‌ర్య‌పోతున్న ఫ్యాన్స్

Nagma |

అలనాటి నటి సీనియర్ హీరోయిన్ నగ్మా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.. స్టార్ హీరోల సరసన నటించి.. ఎన్నో సూపర్ హిట్లనుఅందుకున్న ఈ భామ 1991లో వచ్చిన బాలీవుడ్ చిత్రం బాగీ సినిమాతో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 1990 నుంచి 2008 వరకు సినిమాల్లో నటించి న‌గ్మా చాలా మంది స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి టాప్ స్టార్స్ తో కూడా ప‌లు చిత్రాలు చేసింది. ఇక హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, భోజ్ పురి, మరాఠీ చిత్రాల్లో కూడా నటించి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుంది. హీరోయిన్‌గా రిటైర్ అయిన త‌ర్వాత స‌పోర్టింగ్ పాత్ర‌లు కూడా పోషించింది.

అల్లరి రాముడు మూవీలో ఎన్టీఆర్ కి అత్త‌గా న‌టించి అల‌రించింది.. 2002 తర్వాత తెలుగులో మ‌రో మూవీ చేయ‌ని న‌గ్మా 2008 నుంచి న‌ట‌న‌కి పూర్తిగా దూర‌మైంది. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌తో బిజీ అయింది. 2004లో కాంగ్రెస్ లో చేరిన న‌గ్మా.. 2015లో నగ్మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా కూడా ఎంపికైంది.

అయితే 48 ఏళ్ల నగ్మా ఇప్ప‌టికీ వివాహం చేసుకోక‌పోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఈ అమ్మ‌డు ప‌లువురితో ప్రేమాయ‌ణం న‌డిపింద‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం న‌డిచింది. దీనిపై ఏ నాడు స్పందించ‌ లేదు. క్రికెటర్ గంగూలీతో ,నటుడు శరత్ కుమార్, రవి కిషన్, మనోజ్ తివారీతో నగ్మా ఎఫైర్ పెట్టుకున్నా రంటూ ఎన్నో క‌థ‌నాలు వ‌చ్చాయి.

అయితే ఇన్నాళ్లు త‌న పెళ్లిపై సైలెంట్‌గా ఉన్న న‌గ్మా తాజాగా త‌న‌కి వివాహం చేసుకోవాలనే కోరిక ఉందని చెప్పుకొచ్చింది. వివాహం చేసుకోకూడదు అనే నియమం ఏ నాడు నేను పెట్టుకోలేదు. పిల్ల‌ల్ని క‌నాల‌ని, ఒక కుటుంబం కావాల‌ని నాకు ఉంది. పెళ్ళైతే నాకు సంతోషం.

చూద్దాం కాలం క‌లిసి వ‌స్తే అది కూడా జ‌రుగుతుందేమో అని న‌గ్మా పేర్కొంది. ఇక ఇదిలా ఉంటే నగ్మాకు జ్యోతిక, రోషిణి హాఫ్ సిస్టర్స్ అవుతారు. వీరి తల్లి ఒక్కరే అయిన తండ్రి మాత్రం వేరు. మొదటి భర్త నుండి విడిపోయిన నగ్మా తల్లి సీమ రెండో భర్తతో జ్యోతిక, రోషిణితో పాటు మరొకరిని కన్నారు. నటుడు సూర్య నగ్మాకు బావ అవుతాడన్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే

Exit mobile version