Site icon vidhaatha

NTR | రూ.100 నాణెంపై ఎన్టీయార్‌ ముద్ర ఆవిష్కరణ.. లక్ష్మీ పార్వతికి అవమానం

NTR |

విధాత‌: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు కేంద్రం ప్రభుత్వం అపూర్వ మైన గౌరవాన్ని కల్పిస్తోంది. అయన శత జయంతి సందర్భంగా తెలుగురాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. రజనీకాంత్ వంటి వాళ్ళను పిలిచి ఉత్సవాలను నిర్వహించారు. ఇదే క్రమంలో అయన గౌరవార్థం ఆగస్టు 28న ఆయన ముద్రతో కూడిన రూ.100 నాణేన్ని ఢిల్లోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారు.

దీనికి ఎన్టీయార్ కుటుంబ సభ్యులతోబాటు చంద్రబాబు కుటుంబీకులకు సైతం పిలుపు వచ్చింది. అయితే ఆయనను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న నందమూరి లక్ష్మీపార్వతిని ఈ కార్యక్రమానికి పిలవకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

వాస్తవానికి ప్రభుత్వాలు ఎవరిపేరిట అయినా మరణానంతరం అవార్డులు.. ఇలాంటి గౌరవ కార్యక్రమాలు నిర్వహిస్తే ముఖ్యంగా వారి జీవిత భాగస్వాములకు ఆహ్వానం ఉంటుంది. కానీ ఇక్కడ అయన చనిపోయే నాటికి ఎన్టీయార్ భార్యగా ఉంటూ ఆయనకు జీవిత పర్యంతం సేవలు చేసిన లక్ష్మీపార్వతికి గుర్తింపు రాలేదు.

ఎన్టీయార్‌ను పదవీచ్యుతుడిని చేసి, మానసికంగా వేధించి ఆయన చావుకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కుమార్తెలు, అల్లుళ్ళు, కొడుకులకు పిలుపు చేసిన కేంద్రం ఆయన్ను చివరికాలంలో కనిపెట్టుకుని ఉన్న భార్యను ఎందుకు పట్టించుకోలేదన్న పాయింట్ జనం లేవదీస్తున్నారు.

ఇదిలా వుండగా తనను ఆహ్వానించకపోవడంపై లక్ష్మీపార్వతి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఈ మేరకు ఆమె రాష్ట్రపతి, కేంద్ర ఆర్థికశాఖ మంత్రికి లేఖలు రాశారు. భార్యను అయిన తనను కాదని వాళ్లందరికీ పిలుపు చేసి, వారి సమక్షంలో ఆ నాణేన్ని విడుదల చేయడం ఏమిటి అని ఆమె తన లేఖలో ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version