Site icon vidhaatha

Earn more money: కోటీశ్వరులు కావాలనుకుంటున్నారా? ఈ ఐదు చిట్కాలు పాటించండి..

సమాజంలో ఉన్నతంగా జీవించాలన్నా .. గౌరవం పొందాలనుకున్నా డబ్బు సంపాదన ఎంతో ముఖ్యం. అత్యవసర సమయాల్లో మనలను కాపాడేది డబ్బే.. ఉద్యోగం పోయినప్పుడు.. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు.. కూడా డబ్బే మనకు తోడు ఉంటుంది. అయితే మనం సంపాదించిన డబ్బును దాచుకోకుండా వచ్చింది వచ్చినట్టు ఖర్చు చేసేస్తే భవిష్యత్ లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. కాబట్టి మనం సంపాదించిన డబ్బులో ఎంతో కొంత దాచుకోవాలని.. ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఎలా దాచుకోవాలి.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును ఎలా సంపాదించుకోవాలని ఇందుకు నిపుణులు ఇస్తున్న సూచనలు ఏమిటో ఈ కథనంలో తెలుసుందాం..

ఒకే ఉద్యోగం మీద ఆధారపడకండి

చాలా మంది ఒకే ఉద్యోగం లేదా వ్యాపారం మీద ఆధారపడుతూ ఉంటారు. హఠాత్తుగా ఆ ఉద్యోగం పోయిందంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఉద్యోగం చేస్తూనే ఏదైనా మరో ఆదాయమార్గం వెతుక్కోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరే చేసే ఉద్యోగంతో పాటు మీకున్న ట్యాలెంట్ ఆధారంగా ఇతర వ్యాపకాలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్ లైన్ టీచింగ్… పార్ట్ టైమ్ ఉద్యోగాలు చూసుకోవాలని చెబుతున్నారు.

వేతనంలో కొంత దాచుకోవాలి

ఆర్థిక నిపుణులు 50-30-20 నియమాన్ని సిఫార్సు చేస్తున్నారు. మీకు వచ్చే ఆదాయంలో 50%: రోజువారీ అవసరాలు (ఇంటి అద్దె, ఆహారం, రవాణా) కోసం వెచ్చించాలి. 30% వినోదం, షాపింగ్, ట్రావెల్ కోసం ఖర్చు చేయవచ్చు. ఈ మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగకుండా చూసుకోవాలి. మిగిలిన 20% పొదుపు చేసుకోవాలని లేదంటే పెట్టుబడి పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

ఎమర్జెన్సీ ఫండ్

ప్రతి ఉద్యోగి కొంత మొత్తాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించినా.. వ్యాపారంలో అనుకోకుండా నష్టం వచ్చినా అందులో నుంచి కోలుకొనేందుకు ప్రతి ఒక్కరు ఆరు నెలల నుంచి సంవత్సారానికి సరిపడేలా ఎమర్జెన్సీ ఫండ్ సేవింగ్స్ అకౌంట్ లో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా?

చాలా మంది జీతం జమకాగానే విపరీతంగా ఖర్చు చేస్తుంటారు. అయితే దీన్ని అదుపుచేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి ఖర్చులు, ఆరోగ్య బీమా, విద్య తదితర అవసరాలకు డబ్బును దాచుకొని మిగిలిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలని కోరుతున్నారు. నైపుణ్యాల అభివృద్ధి కోసం కోర్సులు, సెమినార్లకు హాజరు కావాలని సూచిస్తున్నారు.

పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి?

ఉద్యోగం చేయడంతోపాటు నిపుణుల సూచనలతో స్టాక్ మార్కెట్, డివిడెండ్ స్టాక్స్, లేదా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా ఉన్నత వేతన ఉద్యోగాలకు అర్హత సాధించాలని.. తదనుగుణంగా ఆదాయం పెంచుకోవాలని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్, బ్లూ-చిప్ స్టాక్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అయితే ఇందుకోసం కచ్చితంగా సంబంధిత నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

 

 

Exit mobile version