Site icon vidhaatha

ఇరాన్‌లో భారీ భూకంపం: ఏడుగురి మృతి

విధాత: ఇరాన్‌లోని ఖోయ్‌ సిటీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టేర్ స్కేల్‌ పై 5.9 శాతం తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి ఖోయ్‌, అజర్‌బైజాన్ ప్రావిన్స్ లో భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 440 మంది గాయాలయ్యాయి.

భవనాలు కూలిపోవడంతో వాటికింద మరెంత మంది ఉంటారోనని శిధిలాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. భవనాలు కూలుతుండగా చూసిన కొందరు పైనుంచి దూకడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది.

Exit mobile version