Ind vs Pak |
భారత్ – పాకిస్తాన్‌ల మధ్య వైరం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలు, ఆటలు ఇలా ఎందులో అయిన కూడా ఈ రెండు దేశాల మధ్య పోరు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇక క్రికెట్ అయితే మంచి మజా అందించే విధంగా ఫైట్ ఉంటుంది. భారత్ -పాక్ మధ్య క్రికెట్ అంటే నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఆ మ్యాచ్‌ని ఎవరు మిస్ చేయకుండా చూస్తుంటారు.
త్వరలో ఆసియా కప్ జరగనుండగా, ఆ సిరీస్‌లో భారత్ -పాక్ తలపడనున్నాయి. అలానే వరల్డ్ కప్ వన్డే టోర్నీలో కూడా రెండు జట్ల మధ్య ఫైట్ జరగనుంది. ఈ పోరు కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా కప్ టోర్నీలో భారత ఆటగాళ్లు ధరించే జెర్సీపై పాకిస్తాన్ పేరు కనిపించనుంది. ఇది ఆశ్చర్యాన్ని కలిగించిన కూడా అది నిజం.
Ind vs Pak | భారత్‌తో ఆడేందుకు పాక్ విచిత్రమైన కండీషన్స్.. తెరపైకి మరో కొత్త కండీషన్
ఆసియా కప్ 2023లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పాల్గొననుండగా, ఈ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టు తమ జెర్సీపై ‘పాకిస్తాన్’ అని రాసే అవకాశం వుంది. పాకిస్తాన్ ఈ సారి ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇస్తున్నందున భారత జెర్సీపై పాకిస్తాన్ అని రాసి ఉంటుంది.
ఇలా జరగడం చరిత్రలో తొలిసారి. అయితే పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో జరగనున్నాయి. మిగతా టీంలు పాక్‌లో ఆడనున్నారు. ఇక టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్ దశలో భారత్ రెండు సార్లు పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇవి రెండు కనుక ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి ఈ రెండు జట్ల మధ్య ఫైట్ జరగనుంది.
ఇక వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు జరగబోయే ఆసియా కప్ షెడ్యూల్ ఇప్పటికే విడుదల కాగా, ఆగస్టు 30న ముల్తాన్‌లో పాకిస్తాన్- నేపాల్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఆసియా కప్ 2023 టోర్నీ ప్రారంభం కానుంది. గ్రూప్ Aలో ఇండియా, పాకిస్తాన్‌తో పాటు ఆసియా కప్ టోర్నీకి తొలిసారిగా అర్హత సాధించిన నేపాల్ ఉంటాయి. గ్రూప్ Bలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ పోటీ పడనున్నాయి.
సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థులు అయితన ఇండియా- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కాండీలో జరగనుంది. మొట్ట మొదటిసారి ఆసియా కప్‌కి అర్హత సాధించిన నేపాల్ ఎలాంటి సంచలన విజయాలు సాధించకపోతే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందే రెండు మ్యాచులు చూసే అవకాశం ఉంది.
Dhoni | ధోని కూతురి స్కూల్ ఫీజు.. ఎంతో తెలిస్తే ఉలిక్కి పడడం ఖాయం..!