ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి బీమా.. పల్లె పల్లెలో తపాలా బీమా క్యాంపులు

విధాత: ప్రతి ఇంటికీ,ప్రతి వ్యక్తికీ బీమా సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామ సౌభాగ్యం కోసం పల్లె పల్లెలో తపాలా జీవిత బీమా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట డివిజన్ తపాలా సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ సబ్ డివిజనల్ అసిస్టెంట్ సూపరిండెంట్ నయిముద్దీన్‌లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే తపాలా బీమా పాలసీలను ఇటీవల గణనీయంగా విస్తరించారన్నారు ఇప్పుడు ఈ పాలసీలను ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా తీసుకోవచ్చన్నారు. దీనితో […]

  • Publish Date - March 19, 2023 / 01:44 PM IST

విధాత: ప్రతి ఇంటికీ,ప్రతి వ్యక్తికీ బీమా సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామ సౌభాగ్యం కోసం పల్లె పల్లెలో తపాలా జీవిత బీమా క్యాంపులు నిర్వహిస్తున్నట్లు సూర్యాపేట డివిజన్ తపాలా సూపరింటెండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు, మిర్యాలగూడ సబ్ డివిజనల్ అసిస్టెంట్ సూపరిండెంట్ నయిముద్దీన్‌లు తెలిపారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే తపాలా బీమా పాలసీలను ఇటీవల గణనీయంగా విస్తరించారన్నారు ఇప్పుడు ఈ పాలసీలను ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా తీసుకోవచ్చన్నారు.

దీనితో పట్టణాల్లో మాత్రమే కాక పల్లెల్లో కూడా విశేష స్పందన వస్తోందన్నారు. .ఇప్పుడు పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఈ తపాలా జీవిత బీమా పాలసీలను తీసుకుంటున్నారని సూపరింటెండెంట్ తెలిపారు.
అతి తక్కువ ప్రీమియంతో అత్యధిక బోనస్ అందజేసే ఈ పాలసీలు ఐదు రకాలుగా లభిస్తాయన్నారు. వాటి వివరాలను వెల్లడించారు.

1. హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంపిక చేసుకున్న వయసు వరకు ప్రీమియం కట్టి ఆ తర్వాత నిలుపుదల చేస్తారు.ఇన్సూరెన్స్ డబ్బు పాలసీదారు చనిపోయాక నా చెల్లిస్తారు.కుటుంబం,పిల్లల కోసం పెద్ద మొత్తంలో సొమ్ము కావాలనుకున్నవారు ఈ పాలసీని ఎంచుకోవచ్చు

2. ఎండోమెంట్ పాలసీ పాలసీదారుడు కావాలనుకున్నప్పుడు ఒక నిర్దుష్ట గడువులో ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందవచ్చు.పిల్లల పై చదువులు,పెళ్ళిళ్ళు,ఇల్లు కట్టుకోవడం,స్థిరాస్తులు కనుక్కోవాలనుకొనేవారు ఈ పాలసీ ఎంచుకోవచ్చు

3.కన్వర్టిబుల్ హోల్ లైఫ్ పాలసీ మొదట హోల్ లైఫ్ పాలసీ చేసిన వారు కొంత కాలం తర్వాత ఎండోమెంట్ లోకి మారవచ్చు.ముందు దీర్ఘకాలంలో ప్లాన్ చేసుకున్నవారు మధ్యలో మనసు మార్చుకొని డబ్బు ముందే కావాలనుకుంటే ఇలా మార్చుకునే సదుపాయం ఈ పాలసీకి ఉంది

4.యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్సూరెన్స్ పాలసీదారుని అవసరాలకు అనుగుణంగా పాలసీ మెచురిటీ మొత్తంలో నుండి కొంత మొత్తం 4,5 సంవత్సరాలకు ఒకసారి డబ్బు చెల్లించబడుతుంది

5.యుగల్ సురక్ష భార్యాభర్తల్లో ఎవరో ఒకరి పేరు మీద పాలసీ తీసుకుంటే ఇద్దరికీ బీమా వర్తిస్తుంది.తపాలా జీవిత బీమా చేయడానికి అర్హత లేని వారు వారి భర్త/భార్య పేరు మీద పాలసీ చేసుకోవచ్చు

6.చిల్డ్రన్ పాలసీ తల్లి లేదా తండ్రి పేరుతో పాలసీ ఉంటే పిల్లల పేరు మీద కూడా పాలసీ తీసుకోవచ్చు

తపాలా జీవిత బీమా పాలసీల ప్రత్యేకతలు

1. ఏ ఇన్సూరెన్స్ సంస్థ ఇవ్వలేని పాస్ బుక్ సౌకర్యం ఈ పాలసీలకు ఉంది
2. ఆన్లైన్లో కూడా కిస్తీలు కట్టవచ్చు
3. గ్రామీణ ప్రాంత పోస్టాఫీసుల్లో కూడా పేమెంట్ చేసే సౌకర్యం ఉంది
4.డాక్యుమెంట్ ఛార్జీలు ఉండవు.ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తిగా ఉచితం
5. పాలసీని బదిలీ చేసుకోవచ్చు
6. లోన్ సౌకర్యం ఉంది
7.ఎన్ని సార్లైనా నామినీ పేరు మార్చుకోవచ్చు
8. పాలసీ బాండ్ పాలసీదారుని ఇంటికే వస్తుంది
9. ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది
ఇలా.. ఎన్నో లాభాలు ఉన్నాయి

ఈ నెలాఖరులోగా పాలసీ తీసుకుంటే ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23) వచ్చే మొత్తం బోనస్ అదనపు ఆకర్షణ డివిజన్ వ్యాప్తంగా ఉన్న అన్ని పోస్ట్ ఆఫీసుల్లో ఈ పాలసీలు అందుబాటులో ఉన్నాయి.

గ్రామీణ తపాలా జీవిత బీమా

తపాలా జీవిత బీమా పాలసీ తీసుకోవడానికి అర్హత లేని వారు ఈ పాలసీలు తీసుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ పాలసీలు ఇవ్వబడవు.

Latest News