IRCTC Kerala Tour | మండుటెండల్లో కేరళలో చల్లని టూర్‌..! బంపర్‌ ప్యాకేజీని తీసుకొచ్చిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే..!

IRCTC Kerala Tour | వేసవికాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు పాఠశాలలకు యాజమాన్యాలు హాలీడేస్‌ ప్రకటించాయి. దాంతో చాలా మంది వేసవి సెలవుల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. దేవభూమిగా పేరొందిన కేరళ (Kerala)లో పర్యటనకు అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో సముద్ర తీరాలు, అబ్బురపరిచే స్వచ్ఛమైన సరస్సులు, పచ్చదనం పరుచుకున్న పర్వతాలు, కనువిందు చేసేలా […]

  • Publish Date - April 25, 2023 / 03:50 AM IST

IRCTC Kerala Tour |

వేసవికాలంలో ఎండలు దంచికొడుతున్నాయి. మరో వైపు పాఠశాలలకు యాజమాన్యాలు హాలీడేస్‌ ప్రకటించాయి. దాంతో చాలా మంది వేసవి సెలవుల్లో పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ (IRCTC) సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. దేవభూమిగా పేరొందిన కేరళ (Kerala)లో పర్యటనకు అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది.

ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన కేరళలో సముద్ర తీరాలు, అబ్బురపరిచే స్వచ్ఛమైన సరస్సులు, పచ్చదనం పరుచుకున్న పర్వతాలు, కనువిందు చేసేలా కాలువలు ఎన్నో ప్రకృతి ప్రేమికుల మనసును దోచుకుంటుంది. ముఖ్యంగా ఇక్కడి బ్యాక్‌ వాటర్‌ పడవ ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఎండాకాలంలో ప్రకృతి రమణీయత కలిగిన కేరళలో పర్యటిస్తే ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచే ప్యాకేజీ..

ఈ క్రమంలో కేరళలో పర్యటించాలనుకునే వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్యాకేజీని ప్రకటించింది. ‘కేరళ హిల్స్‌ అండ్‌ వాటర్స్‌’ పేరుతో ప్రాకేజీని తీసుకురాగా.. హైదరాబాద్‌ నుంచి మొదలుకానున్నది. ఐదు రాత్రులు, ఆరు రోజులు పర్యటన కొనసాగుతుంది. మే 2న టూర్‌ ప్రారంభంకానుండగా.. ఇందులో మున్నార్‌, అలెప్పీతో పాటు పలు ప్రాంతాలను కవర్‌ చేస్తుంది.

తొలిరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణించి రెండోరోజు మధ్యాహ్నం 12.55 గంటలకు ఎర్నాకులం రైల్వేస్టేషన్‌కు చేరుతారు. అక్కడి నుంచి మున్నార్‌కు బయలుదేరి హోటల్‌కు చేరుకుంటారు. సాయంత్రం మున్నార్‌ పట్టణంలో పర్యటన కొనసాగుతుంది. రాత్రి మున్నార్‌లోనే బస చేయాల్సి ఉంటుంది.

ఇక మూడోరోజు ఉదయం ఎర్నాకులం నేషనల్‌ పార్క్‌ చేరుతారు. అక్కడ టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌, ఎకో పాయింట్‌లను చూడొచ్చు. మళ్లీ తిరిగి రాత్రి మున్నార్‌కు చేరుకొని ఇక్కడే బస చేస్తారు. నాలుగో రోజు అలెప్పీకి వెళ్లికి హోటల్‌లో బస చేస్తారు. ఆ తర్వాత బ్యాక్‌ వాటర్‌ ప్రాంతానికి వెళ్తారు. ఈ పర్యటన అనంతరం మళ్లీ రాత్రి అలెప్పీలోనే బస చేయాల్సి ఉంటుంది.

ప్యాకేజీ వివరాలు ఇలా..

ఐదో రోజు ఉదయం హోటల్‌ను ఖాళీ చేసి ఎర్నాకులం చేసుకుంటారు. ఉదయం 11.20 గంటలకు మళ్లీ రైలు తిరుగు ప్రయాణమవుతుంది. ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుతుంది. దాంతో పర్యటన ముగుస్తుంది. ఇక ప్యాకేజీ విషయానికి వస్తే ఒకరికి రూ.32,320 చెల్లించాల్సి ఉంటుంది.

ఇద్దరు కలిసి బుక్‌ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.18,740, ట్రిపుల్‌ షేరింగ్‌లో ఒక్కొక్కరికి రూ.15,130 ప్యాకేజీ లభిస్తుంది. థర్డ్‌ ఏసీ, స్లీపర్‌ ప్యాకేజీలు వేర్వేరుగా ఉన్నాయి. 5-11 సంవత్సరాల పిల్లలకు సైతం టికెట్‌ ధరలు నిర్ణయించారు. ఈ టూర్‌ ప్యాకేజీలో హోటల్‌, బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌, డిన్నర్‌ అన్నీ కవర్‌ కానున్నాయి. బుకింగ్‌ తదితర మరిన్ని వివరాలకు ఈ వెబ్‌సైట్‌ https://www.irctctourism.com/tourpackageBooking?packageCode=SHR092 లింక్‌ క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు.

Latest News