IRCTC | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ బంపర్‌ ఆఫర్‌..! హైదరాబాద్‌ నుంచి రూ.3వేలకు టూర్‌ ప్యాకేజీ!

IRCTC Tour | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. రూ.3వేల ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ చూసే అవకాశం కల్పించింది. ప్రతి బుధవారం హైదరాబాద్‌ నుంచి ఈ ప్యాకేజీలో టూర్‌ అందుబాటులో ఉండనున్నది. ‘సాయి సన్నిధి’ పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. రెండు రోజులు, మూడురాత్రులు టూర్‌ కొనసాగనున్నది. ప్రయాణం ఇలా.. Day-1 : సాయి సన్నిధి ప్యాకేజీ టూర్‌ తొలి రోజు హైదరాబాద్‌లో […]

  • Publish Date - June 8, 2023 / 02:51 AM IST

IRCTC Tour | షిర్డీ సాయిబాబా భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం స్పెషల్‌ ప్యాకేజీని ప్రకటించింది. రూ.3వేల ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ చూసే అవకాశం కల్పించింది. ప్రతి బుధవారం హైదరాబాద్‌ నుంచి ఈ ప్యాకేజీలో టూర్‌ అందుబాటులో ఉండనున్నది. ‘సాయి సన్నిధి’ పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. రెండు రోజులు, మూడురాత్రులు టూర్‌ కొనసాగనున్నది.

ప్రయాణం ఇలా..

Day-1 : సాయి సన్నిధి ప్యాకేజీ టూర్‌ తొలి రోజు హైదరాబాద్‌లో మొదలవుతుంది. బుధవారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అజంతా ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా రైలులో ప్రయాణం కొనసాగుతుంది.

Day-2: రెండో రోజు రైలు ఉదయం 7.10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి షిర్డీకి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. హోటల్‌లో చెకిన్‌ అవ్వాలి. ఆ తర్వాత సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. అయితే, సొంత ఖర్చులతోనే సాయిబాబాను దర్శించుకోవాల్సి ఉంటుంది.

దర్శనం పూర్తయ్యాక సాయంత్రం 4 గంటలకు శనిశిగ్నాపూర్ బయలుదేరాలి. అక్కడ శనైన్చర ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత తిరిగి నాగర్‌సోల్‌ బయలుదేరాలి. రాత్రి 9.20 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు వచ్చే అజంతా రైలు ఎక్కాలి. రాత్రంతా రైలు ప్రయాణం కొనసాగుతుంది.

Day-3: మూడో రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటారు. దాంతో మూడురోజుల పర్యటన ముగుస్తుంది.

సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ఇలా..

ఐఆర్‌సీటీసీ టూరిజం సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ వేర్వేరు కేటగిరీల్లో ఐఆర్‌సీటీసీ అందుబాటులో ఉంచింది. నలుగురి నుంచి ఆరుగురు కలిసి బుక్ చేసుకుంటే ప్యాకేజీ తక్కువ ధరకే లభించనున్నది. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.3,170, ట్విన్ షేరింగ్ ఒక్కొక్కరు రూ.3,700 చెల్లించాల్సి ఉంటుంది.

కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.4,860, ట్విన్ షేరింగ్ ఒక్కొక్కరికి రూ.5,390 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం ఉంటుంది. ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ టూర్‌ ప్యాకేజీలోనే కవర్‌ కానున్నాయి. మిగతా వాటిని ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

Latest News