Site icon vidhaatha

JD Lakshminarayana | జేడీ గిరి ప్రదక్షిణ.. జనంలో మమేకం

విధాత‌: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana ) గత ఐదేళ్లుగా ప్రజల్లో నిత్యం ఉండేలా ప్రోగ్రాములు రూపొందిస్తున్నారు. అవకాశం ఉన్న ఏ ప్రోగ్రాం కూడా మిస్ కాకుండా ప్రజల్లో ఉంటూ వారి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా గురు పౌర్ణమి సందర్భంగా లక్షలాది మంది విశాఖలో సింహాచలం గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ సందర్భముగా అయన సైతం భక్తులు, యువకులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక ప్రోగ్రామ్ అయినప్పటికీ పర్యావరణానికి విఘాతం కలగకుండా ప్రదక్షిణ చేద్దాం విశాఖను కాపాడుకుందాం అంటూ అయన ఓ సందేశం కూడా ఇచ్చారు.

వాస్తవానికి గత 2019 ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ యువత, విద్యావంతుల మద్దతు పొంది 2. 8 లక్షల ఓట్లు సాధించారు. ఈయన గెలవలేకపోయినా టిడిపి అభ్యర్థి , బాలకృష్ణ రెండో అల్లుడు, గీతం కాలేజీ అధినేత శ్రీ భారత్ ను ఓడించడానికి కారణమయ్యారు అని అంటుంటారు. ఆ ఎన్నికలు ముగిశాక సైతం జేడీ రాష్ట్రంలో విస్తృతంగా తిరుగుతూ ప్రజాసమస్యల మీద జనంలో అవగాహనా కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేస్తున్నారు.

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ మీద కూడా అయన స్పందిస్తూ ప్రజల డబ్బుతో దాన్ని తామే టేకోవర్ చేసుకుని నిర్వహిస్తాం అన్నారు. అది సాధ్యం కాకున్నా.. ఇక స్టీల్ ప్లాంట్ మీద జేడీ సుప్రీం కోర్టులో కేసు కూడా వేసి దానిని పరిరక్షించే పనికి సిద్ధం అయ్యారు . అంతేకాకుండా విజయనగరం గంట్యాడ మండలంలో కొంత పొలాన్ని లీజుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం చేసి వరి ప్యాంటు పండించారు.

ఇక రానున్న ఎన్నికల్లో టిడిపి లేదా బిజెపి ఇంకా కుదిరితే జగన్ పార్టీ తరఫున విశాఖ నుంచి పోటీ చేసేందుకు రెడీ అన్నట్లుగా ఉన్న ఆయన తరచూ కాలేజీలకు వెళ్లి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెబుతూ వస్తున్నారు. ఇక ఆయన మళ్ళీ విశాఖనుంచి పోటీకి సిద్ధం అంటున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ అనే అంశాలను ఎజెండాగా తీసుకుని సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేసారు.. అయన వెంట యూత్ సైతం నడిచి వెళ్లారు.

Exit mobile version