Site icon vidhaatha

Gajwel | గజ్వేల్ లో జర్నలిస్టు ఆత్మహత్య

Gajwel |

విధాత: సిద్దిపేట జిల్లా గజ్వేల్ కేంద్రంగా పనిచేస్తున్నఓ పత్రిక రిపోర్టర్ వేణుమాధవ్(34) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటి నుండి బయలుదేరిన అతను, తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వేణు ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, బుధవారం సాయంత్రం గజ్వేల్ పట్టణంలోని ఎర్రకుంటలో మృతదేహాన్ని కనుగొన్నారు. ఆన్లైన్ అప్పుల భారం, వాటి వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతునికి భార్య, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు కవల ఆడ పిల్లలున్నారు.

తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే విరాహత్ అలీ గజ్వేల్ చేరుకొని, వేణు మృతదేహం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Exit mobile version