SC Relief For Women Journalists | మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట

పల్స్ న్యూస్ ఎండీ రేవతి, రిపోర్టర్ తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పోలీస్ కస్టడీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బెయిల్‌పై ఉన్న వారిని కస్టడీకి ఇవ్వడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.

Pogadadanda Revathi and Thanvi Yadav

విధాత, హైదరాబాద్ : మహిళా జర్నలిస్టులు పల్స్‌ న్యూస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేవతి, , న్యూస్‌ రిపోర్టర్‌ బండి సంధ్యా అలియాస్ తన్వి యాదవ్‌లకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రేవతి, తన్వి యాదవ్‌లను పోలీస్ కస్టడీకి అనుమతించిన తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బెయిల్‌లో ఉన్న ఇద్దరిని పోలీస్ కస్టడీకి హైకోర్టు ఎలా అనుమతిస్తుందని మహిళా జర్నలిస్టుల తరపు లాయర్ వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన ఓ రైతు వీడియోను పోస్ట్‌ చేయడంపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్ చేసింది. తదుపరి వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదనంతరం జర్నలిస్టులను పోలీస్ కస్టడీకి హైకోర్టు అనుమతించగా..దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో వారికి ఊరట దక్కింది.