Junior NTR
విధాత: ఎన్టీయార్ శత జయంత్యుత్సవాలకు అటెండ్ కానందుకు జూనియర్(Jr. NTR) పెద్ద మూల్యం చెల్లించుకుంటున్నట్లు ఉంది. చంద్రబాబు, టిడిపి అభిమానులు కొందరు ఆయన్ను సోషల్ మీడియా వేదికల్లో ఘోరంగా దూషిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆయనతో బాటు జూనియర్ తల్లిని సైతం ఈ పంచాయతీలోకి లాగుతున్నారు.
వాస్తవానికి మనవడు అయిన జూనియర్‌కు పిలుపు లేదు. ఆమధ్య విజయవాడలో జరిగిన సభకు సైతం ఎక్కడో ఉన్న రజనీకాంత్‌ను పిలిచారు.. కానీ సొంత మనవడు అయినా జూనియర్ను పిలవలేదు. ఆ తరువాత ఖమ్మంలో ఎన్టీయార్ విగ్రహావిష్కరణకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వెళ్లి పిలవడంతో నాలుక కరుచుకున్న టీడీపీ అప్పటికప్పుడు జూనియర్‌ను పిలిచారు. అయితే దానికి అయన హాజరు కాలేదు. దీంతో చంద్రబాబు, అయన అనుచరులు… అయన మోచేతి నీళ్లు తాగేవాళ్ళలో అసలు మనుషులు నిద్రలేచారు.
అసలు జూనియర్ ఎన్టీయార్ అనే కుర్రాడు ఎన్టీయార్ కుటుంబానికి చెందినవాడే కాదని, హరికృష్ణ రెండో భార్యకు కలిగిన అక్రమ సంతానం అని.. ఆయనది కల్తీ జన్మ అంటూ ఫెస్‌బుక్, ట్విట్టర్.. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు.. పోస్టర్స్ ట్రోలింగ్స్ మొదలైనాయి.
కల్తీ గాడు అంటూ ఆయనతో బాటు అయన తల్లి శాలినీని సైతం దూషిస్తూ పోస్టులు గుమ్మరిస్తున్నారు. నీకు అసలు స్టార్ డం వచ్చిందే ఎన్టీయార్ ఫ్యామిలీ వల్ల. నీకు ఇమేజి వచ్చింది కూడా ఆ కుటుంబంతోనే .. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి దూరం అవుతావా కల్తీగా అంటూ చంద్రబాబు అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు.
అంటే అవమానాల పాలైనా సరే చంద్రబాబు పంచన ఉంటూ వారి ఆశీర్వాదాలు కోసం చేతులు చాచాలన్నది వారి అభిమతంలా ఉంది. మొన్న కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటనలో ఉండగా కొందరు హరికృష్ణ అభిమానులు హరికృష్ణ, జూనియర్ ఫోటోలు చూపిస్తూ జోహార్ హరికృష్ణ.. జై జూనియర్ అని నినదిస్తేనే చంద్రబాబు ఓర్వలేక వారి మీద కేకలు వేశారు. దీంతో చంద్రబాబు నైజాన్నీ పూర్తిగా ఎరిగిన జూనియర్ ఎందుకు వారి చేతిలో ఆయుధం అవుతాడు..
అందుకే సొంత వ్యక్తిత్వంతో దూరంగా ఉంటున్నాడు.. ప్రస్తుతానికి చంద్రబాబు, అయన మద్దతుదారులకు సోషల్ మీడియా వేదికగా ఆహారంగా మారాడు. ఇదిలా ఉండగా ఎన్టీయార్ జయంత్యుత్సవ సభకు హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ సైతం రాలేదు. దీంతో హరికృష్ణ ఫామిలీ మొత్తం ఆ సభకు దూరంగా ఉన్నట్లు అయింది.
Sad that some one has to go through this..
This is the low that this Nara’s TDP can get in to.. pic.twitter.com/GbO0JDeDAG— Eshwar Vishnubhotla (@Eswarkarthikeya) May 21, 2023