Site icon vidhaatha

గురుకుల జూనియర్ లెక్చరర్ల పోస్టుల ఫలితాలు విడుదల

విధాత, హైదారాబాద్‌ : తెలంగాణ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో 1,924 జూనియర్ లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌లో పెట్టారు. జేఎల్ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగాయి. దివ్యాంగుల కేటగిరి ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పోస్టులకు ఎంపికైన వారి (సబ్జెక్టుల వారీగా) ప్రాథమిక జాబితాలను విడుదల చేశారు.

Exit mobile version