Site icon vidhaatha

కేతికా శర్మ: మొహమాటం లేని భామ.. మగాళ్లే సిగ్గుపడాలి బాసూ!

విధాత‌, సినిమా: కేతికా శర్మ.. ఢిల్లీలో జన్మించి లక్నోలో చదువు పూర్తి చేసింది. 2021లో తెలుగులో విడుదలైన ‘రొమాంటిక్’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. రొమాంటిక్ చిత్రంలో ఆకాష్ పూరి హీరోగా నటించగా.. పూరి జగన్నాథ్, చార్మి నిర్మించారు.

చదువు పూర్తి కాగానే మోడలింగ్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ థగ్ లైఫ్ అనే వీడియోతో పాపులర్ అయింది. మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

ఆహా ఓటీటీ కోసం ప్రమోట్ చేసిన ప్రొమోలలో ఈమె అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. నాగశౌర్య ‘లక్ష్య’ వైష్ణవ తేజ్‌తో ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలలో నటించింది. రాబోయే అల్లు అర్జున్ చిత్రంలో కూడా ఈమె నటించనుందని వార్తలు వస్తున్నాయి.

ఇక విషయానికొస్తే చిత్ర పరిశ్రమలో సక్సెస్‌ని లక్ డిసైడ్ చేస్తుంది. టాలెంట్, స్క్రిప్ట్ సెలక్షన్, తొక్క తోటకూర అంతా ట్రాష్ అని కొట్టి పారేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆందం, నటన, కాంబినేషన్‌లు కుదిరినా కేతికా శర్మకు అదృష్టం ఆమడ దూరంలో ఉంటూ వస్తుంది. దీంతో ఈ భామ వెండితెర‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.

ఎందుకంటే ఆమె నటించిన మొదటి మూడు చిత్రాలు ప్లాప్స్ కావడంతో ఐరన్ లెగ్ ఇమేజ్ సొంతం చేసుకుంది. రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా.. మూడు ఫ్లాప్ అవడంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడింది.

హిట్ హీరోయిన్ల‌కు అడిగినంత ఇచ్చి తీసుకుంటారు. అందుకే ఒక్క సక్సెస్ కూడా చూడని కేతికను ఎవరూ పట్టించు కోవడం లేదు. దాంతో ఆమె రెచ్చిపోయి సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్‌ని చూపించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కేతిక చేసిన బోల్డ్ ఫోటోషూట్ వైరల్ అవుతోంది. ఎంత అవకాశాలు లేకపోతే మాత్రం.. మరీ ఇంతగానా.. అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version