Komatireddy | NH65పై బ్లాక్ స్పాట్ల నివారణకు.. కేంద్రం నుంచి రూ.420.26 కోట్లు మంజూరు: MP కోమటిరెడ్డి

Komatireddy Venkatreddy విధాత: జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి.. వంతెనల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 420.26 కోట్లు నిధులు మంజూరు చేసిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ బాగా పెరిగిందని, దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ, ఎన్నో కుటుంబాలు రోడ్డున […]

  • Publish Date - April 26, 2023 / 10:59 AM IST

Komatireddy Venkatreddy

విధాత: జాతీయ రహదారి 65పై రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి.. వంతెనల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 420.26 కోట్లు నిధులు మంజూరు చేసిందని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) వెల్లడించారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై వాహనాల రద్దీ బాగా పెరిగిందని, దీంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మూడేళ్లుగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి పలుమార్లు వినతిపత్రాలు అందించడం జరిగిందన్నారు.

ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను అధికారులు గుర్తించగా, వాటి వివరాలను ప్రధాని మోడీకి, మంత్రి గడ్కరీకి వివరించానన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో సైతం లేవనెత్తానని, 65వ నంబర్ జాతీయ రహదారిని 6 లైన్లుగా మార్చాలని ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరడం జరిగిందన్నారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం కేంద్రంతో నేను జరిపిన సంప్రదింపులు ఒక్కొక్కటిగా ఫలిస్తున్నాయని, తొలి దశలో జాతీయ రహదారి 65పై 19 బ్లాక్ స్పాట్లను గుర్తించిన కేంద్ర రోడ్డు రవాణా శాఖ, వాటి అభివృద్ధికి మొత్తం 420.26 కోట్లను మంజూరు చేసిందన్నారు. ఇందుకు భారత ప్రధాని మోడీకి, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

కేంద్రం మంజూరు చేసిన 19 బ్లాక్ స్పాట్లు.. కేటాయించిన నిధులు..

పెద్దకాపర్తి- రూ.29.90 కోట్లు,
చిట్యాల- రూ.42.18 కోట్లు,
నల్గొండ క్రాస్ రోడ్డు + కట్టంగూర్- రూ .0.26 కోట్లు,
కొర్లపహాడ్- రూ.5.96 కోట్లు,
ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ + జనగామ క్రాస్ రోడ్డు- రూ.58.44 కోట్లు,
ఈనాడు ఎదురుగా- రూ.27.97 కోట్లు,
ధురాజ్‌ పల్లి- రూ.2.80 కోట్లు,
ముకుందపురం- రూ.13.86 కోట్లు,
ఆకుపాముల- రూ.2.16 కోట్లు
కొమరబండ క్రాస్ రోడ్డు- రూ.31.01 కోట్లు,
కటకమ్మ గూడెం- రూ.10.89 కోట్లు,
మేళ్లచెరువు- రూ.0.46 కోట్లు,
శ్రీరంగాపురం- రూ.8.50 కోట్లు,
రామాపురం క్రాస్ రోడ్డు- రూ.30.26 కోట్లు,
నవాబ్ పేట్- రూ.0.21 కోట్లు,
చౌటుప్పల్- రూ.114.40 కోట్లు,
టేకుమట్ల- రూ.41.02 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.

Latest News