Site icon vidhaatha

Lady Aghori: లేడీ అఘోరి నన్ను.. మా చెల్లిని పెళ్లి చేసుకుంది!

Lady Aghori: తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా తన వింత చేష్టలు.. ఆలయాల సందర్శనలు.. అడ్డొచ్చిన వారిపై దాడులు.. నగ్న పూజలు వంటి వివాదాలతో వార్తల్లో నిలిచిన లేడీ అఘోరిపై ఏపీలో మరో కేసు నమోదైంది. అఘోరీ తమ కూతురుని వశపరుచుకుందని.. తమ కూతురుని తమకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ఓ యువతి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీ అఘోరీ.. తమ కూతురు శ్రీవర్షిణిని కిడ్నాప్ చేసి.. మత్తుమందులు ఇచ్చి వశం చేసుకుందని తండ్రి కోటయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులంతా ఒత్తిడి చేసినా శ్రీవర్షిణి ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన బిడ్డను  అఘోరీ నుంచి విడిపించాలని తల్లి దండ్రులు కోరారు.

కాగా మరోవైపు శ్రీవర్షిణి అన్న విష్ణు మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టాడు. లేడీ అఘోరీ తనను, తన చెల్లిని పెళ్లి చేసుకుందని ఆరోపించాడు. తనను లైంగికగా టార్చర్ పెట్టిందని పేర్కొన్నాడు. లేడీ అఘోరీలో పురుష లక్షణాలు ఉన్నాయని తెలిపాడు. చెన్నై నుంచి తీసుకొచ్చిన మంగళసూత్రాలను వర్షిణి మెడలో అఘోరీ కట్టిందని వెల్లడించాడు. తన మెడలో పసుపు తాడు కట్టి తనను కూడా పెళ్లి చేసుకుందని విష్ణు తెలిపాడు. అఘోరీకి కొంతమంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని, వారు ఆర్ధికంగా సాయం చేస్తున్నారని తెలిపారు. లేడీ అఘోరీ వద్ద ఉన్న తమ చెల్లెల్ని తమకు అప్పగిస్తే తాము ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటామని పోలీసులను కోరాడు.

తన శిష్యురాలిగా చెప్పుకొంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్య విష్ణుతో అఘోరీ అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా వర్షిణి, అఘోరీ లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరీ ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆరోపణలు అవాస్తవం : అఘోరీ

వర్షిణి అన్న విష్ణు, తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై లేడీ అఘోరీ స్పందించింది. తాము పెళ్లి చేసుకోలేదని చెబుతుంటే పదేపదే అదే ఆరోపిస్తున్నారని చెప్పింది. ఇప్పుడు తాను.. వర్షిణి పెళ్లి చేసుకున్నామని చెబుతున్నానని ఏం చేస్తారంటూ ఎదురుదాడికి దిగింది. తాను వర్షిణిని ట్రాప్ చేయలేదని.. ఆమె ఇష్టంతోనే తన వద్దకు వచ్చిందని తెలిపింది. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వర్షిణి తనను కలిసి వాళ్ల ఇంటికి తీసుకెళ్లిందని.. అక్కడ మొత్తం 7 రోజులు ఉన్నానని పేర్కొన్నది. మొదటిసారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నానని.. వారు తనను బాగానే చూసుకున్నారని అఘోరీ తెలిపింది.

వర్షిణి అన్నయ్య విష్ణుతో అసభ్యంగా ప్రవర్తించినట్టున్న వీడియో కేవలం ఒక రీల్ కోసం చేసినది మాత్రమేనని.. అంతేకానీ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని సమర్థించుకున్నది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని.. అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుని ఉందని వెల్లడించింది. అది కేవలం ఫన్ కోసం మాత్రమే జరిగిందని.. దానిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అఘోరీ తప్పుబట్టింది. మొత్తం మీద లేడీ అఘోరీ కిడ్నాప్ కేసు, లైంగిక ఆరోపణలు ఎదుర్కోంటున్న నేపథ్యంలో మునుముందు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version