Site icon vidhaatha

Lavanya Tripathi: మెగా ప్రిన్స్‌తో మ్యారేజ్.. బయటకు చెప్పడం నాకు ఇష్టం లేదు: లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi, Varun tej

విధాత‌: టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ఒకరు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ ‘సీతారామం’ డైరెక్టర్ హ‌ను రాఘ‌వ‌పూడి తెర‌కెక్కించిన ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో పద్ధతిగా.. ముద్దుగా.. క్యూట్‌గా తన నటనతో ఎంతో ఆకట్టుకుంది.

ఆ తర్వాత స్టార్ హీరోల సరసన లావణ్య త్రిపాఠికి మంచి అవకాశాలు దక్కాయి. కానీ ఆమె అనుకున్న స్థాయిలో విజయాలు సాధించలేదు. సినిమాల సంగతి అలా ఉంటే కొంతకాలంగా లావణ్య మెగా వారసుడు వరుణ్ తేజ్ (Varun tej) డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్‌ ఉన్నాయి. వీరిద్దరూ గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్‌, ఆతఃరిక్షం సినిమాల్లో నటించారు. ఈ క్రమంలో తాజాగా పెళ్లి వార్తలపై ఈ సొట్టబుగ్గల సుందరి స్పందించింది.

వరుణ్ తేజ్‌తో వస్తున్న వార్తలపై అతని పేరు ఎత్తకుండా ఆమె ఆన్సర్ ఇచ్చింది. నా పెళ్లి విషయంలో నా తల్లిదండ్రులు నన్ను ఒత్తిడి చేయడం లేదు. కాబట్టి నేను కూడా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పెళ్లికి సంబంధించి నేను ఏ క‌ల‌లు క‌న‌డం లేదు. ప్రస్తుతం నా మొత్తం దృష్టంతా సినిమాల పైనే ఉంది.

కానీ వివాహం మీద నాకు నమ్మకం ఉంది. నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి జరుగుతుంది. అయినా పెళ్లి అనేది నా పర్సనల్ లైఫ్‌కి సంబంధించింది. కాబట్టి నా పర్సనల్ విషయాల గురించి బయటకు చెప్పడం నాకు ఇష్టం ఉండదు.. అని చెప్పుకొచ్చింది లావ‌ణ్య‌ త్రిపాఠి.

లావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది. లావణ్య తండ్రి హైకోర్టు న్యాయవాది కాగా తల్లి ఉపాధ్యాయిరాలు. ఈ అందాల రాక్షసికి ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారు. ఈ భామ రిషి దయారామినేషన్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా సాధించింది. చిన్నప్పటి నుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని కలలు కన్న లావణ్య త్రిపాఠి.. తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్ రంగంలో టీవీ కార్యక్రమాల్లో ఎంట్రీ ఇచ్చింది.

2006లో అందాల భామ‌గా ఉత్తరాఖండ్ కిరీటం సొంతం చేసుకుంది. అలా మోడలింగ్ తర్వాత డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తొలిసినిమా అందాల రాక్షసి పేరుతో హీరోయిన్‌గా పరిచయమైంది. అందాల రాక్షసి సినిమాలో అత్యుత్తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అతి తక్కువ సమయంలోనే పాపులారిటి సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు తక్కువ అవడంతో.. వెబ్ సిరీస్‌లలో కూడా చేస్తోంది. రీసెంట్‌గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘పులి మేక’ వెబ్ సిరీస్ విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

Exit mobile version