Site icon vidhaatha

Gujarat: వంటింట్లోకి సింహం.. కుటుంబ సభ్యులు పరార్!

Lion Enters In kitchen: అడవిలో తిరిగే సింహాన్ని చూస్తేనే భయంతో దూరంగా పరుగెడుతారు. అలాంటిది ఇంట్లో అందులో కిచెన్ లో కళ్లముందు ఊహించని రీతిలో సింహన్ని చూస్తే భయంతో గుండె జారి పోక మానదు. అలాంటి ఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుజరాత్ లోని అమ్రేలి జిల్లా కోవాయ గ్రామంలో ఓ సింహం ఇంట్లోకి ప్రవేశించింది. ఇంట్లో నిద్రిస్తున్న కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వేళ వచ్చిన శబ్దాలకు మేల్కోని శబ్ధాలు వచ్చిన కిచెన్ గది వైపు వెళ్లారు. వంట గదిలో ఏదో పెద్ధ జంతువు కనిపించింది.

మెల్లిగా లైట్ వేసి అదేమిటో చూసేసరికి వారి గుండె ఆగినంత పనైంది. వంటగదిలోని గోడపై నక్కి చూస్తున్న సింహాన్నిచూసిన కుటుంబ సభ్యులు భయంతో కేకలు వేస్తూ భయటకు పరుగులు తీశారు. వారి కేకలతో మృగరాజు కూడా మెల్లగా వంట గదిలోంచి బయటకు వచ్చి తాపీగా స్థానిక దేవాయం ముందునుంచి రోడ్డుపై దర్జాగా నడుస్తు వెళ్లిపోయింది. సింహం వంటగది గోడపై నక్కి చూస్తుండటం..బయట రోడ్డు మీదగా వెలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వంట గదిలోకి వెళ్లి సింహాన్ని లైట్ వేసి దగ్గర నుంచి చూసిన సందర్భంలో అది దాడి చేయకపోవడం ఆ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నారు. సింహం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం గ్రామంలోకి వచ్చి ఉండవచ్చని అటవీ అధికారులు వెల్లడించారు. తరుచు అడవి చుట్టుపక్కల గ్రామాలకు వన్యప్రాణులు రావడం జరుగుతుందని..వాటితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Exit mobile version