ఇన్సూరెన్స్ డ‌బ్బుల కోసం భార్య‌ను హ‌త్య చేయించిన భ‌ర్త‌

ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య పేర చేయించిన ఇన్సూరెన్స్ డ‌బ్బుల కోసం ఆమెను రౌడీషీట‌ర్ చేత హ‌త్య చేయించాడు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన మ‌హేశ్ చాంద్‌కు షాలు అనే యువ‌తితో 2015లో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఒక పాప కూడా జ‌న్మించింది. అయితే షాలును వ‌రక‌ట్నం కోసం మ‌హేశ్ వేధింపుల‌కు గురిచేశాడు. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. మ‌హేశ్ జైలు పాల‌య్యాడు. […]

  • Publish Date - December 2, 2022 / 01:44 AM IST

ఓ భ‌ర్త దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న భార్య పేర చేయించిన ఇన్సూరెన్స్ డ‌బ్బుల కోసం ఆమెను రౌడీషీట‌ర్ చేత హ‌త్య చేయించాడు. ఈ దారుణ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జైపూర్‌కు చెందిన మ‌హేశ్ చాంద్‌కు షాలు అనే యువ‌తితో 2015లో వివాహ‌మైంది. ఈ దంప‌తుల‌కు ఒక పాప కూడా జ‌న్మించింది. అయితే షాలును వ‌రక‌ట్నం కోసం మ‌హేశ్ వేధింపుల‌కు గురిచేశాడు. దీంతో ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో.. మ‌హేశ్ జైలు పాల‌య్యాడు. కొన్ని నెల‌ల క్రితం జైలు నుంచి తిరిగొచ్చాడు మ‌హేశ్‌.

త‌న‌ను జైలుకు పంపించిన భార్య‌ను ఎలాగైనా చంపాల‌ని, ఆమె పేరిట ఉన్న ఇన్సూరెన్స్ డ‌బ్బుల‌ను క్లెయిమ్ చేసుకోవాల‌ని మ‌హేశ్ నిర్ణ‌యించుకున్నాడు. షాలు పేరిట రూ. 1.90 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఇక రౌడీషీట‌ర్ ముఖేశ్ సింగ్ రాథోడ్‌ను మ‌హేశ్ సంప్ర‌దించాడు. త‌న భార్య‌ను చంపాల‌ని, అందుకు రూ. 10 ల‌క్ష‌ల సుఫారీ మాట్లాడాడు. మొదటి విడుత‌లో భాగంగా రూ. 5.50 ల‌క్ష‌ల‌ను ముకేశ్‌కు మ‌హేశ్ అప్ప‌జెప్పాడు.

బాలాజీ టెంపుల్‌కు వెళ్తే బాధ‌లు తీరుతాయ‌ని..

మ‌న ఇద్ద‌రి మ‌నస్ప‌ర్థ‌లు రాకుండా ఉండాలంటే, బాధ‌లు తీరాలంటే బాలాజీ ఆల‌యానికి వెళ్లాల‌ని భ‌ర్త షాలుకు మ‌హేశ్ చెప్పాడు. 11 రోజుల పాటు బాలాజీ ఆల‌యానికి వెళ్లొస్తే మ‌న స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని భార్య‌కు తెలిపాడు. ఇక షాలు నిజ‌మే అయి ఉండొచ్చ‌ని న‌మ్మింది. త‌న క‌జిన్ రాజుతో క‌లిసి బైక్‌పై బాలాజీ టెంపుల్‌కు షాలు బ‌య‌ల్దేరింది. అయితే మార్గ‌మ‌ధ్య‌లో వారి బైక్‌ను రౌడీషీటర్ కారు ఢీకొట్టింది. అక్క‌డిక‌క్క‌డే షాలు, ఆమె క‌జిన్ మృతి చెందారు. ఈ ఘ‌ట‌న అక్టోబ‌ర్ 5వ తేదీన చోటు చేసుకుంది.

రూ. 1.90 కోట్లు క్లెయిమ్..

ఇక షాలు మృతి చెంద‌డంతో మ‌హేశ్ పండుగ చేసుకున్నాడు. భార్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ రూ. 1.90 కోట్ల‌ను క్లెయిమ్ చేసుకున్నాడు. స‌హ‌జంగా మ‌ర‌ణిస్తే రూ. కోటి, రోడ్డుప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే రూ. 1.90 కోట్లు ఇచ్చేలా ఆ ఇన్సూరెన్స్ పాల‌సీ నిబంధ‌న‌ల్లో ఉంది. అయితే షాలు బంధువులకు అనుమానం రావ‌డంతో.. పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది.