దక్షిణ ధ్రువం వద్ద -64 డిగ్రీల సెల్సియస్

ప్రపంచంలో చాలా ప్రాంతాలు ప్రస్తుతం చలి తీవ్రతకు అద్దం ప‌డుతున్నాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద చ‌లి మ‌రీ ఎక్కువగా ఉంటుంది

  • Publish Date - December 22, 2023 / 09:04 AM IST

  • గ్లాస్‌లో బీర్ పోస్తే గ‌డ్డ క‌ట్టుడే!
  • చ‌లి పరిస్థితిని చిత్రీక‌రించిన ఫోటోగ్రాఫర్
  • సోష‌ల్ మీడియాలో పోస్టు.. నిమిషాల్లోనే 20 ల‌క్ష‌ల వ్యూస్‌



విధాత‌: ప్రపంచంలో చాలా ప్రాంతాలు ప్రస్తుతం చలి తీవ్రతకు అద్దం ప‌డుతున్నాయి. ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద చ‌లి మ‌రీ ఎక్కువగా ఉంటుంది. ఏడాది పొడవునా ప్రత్యక్ష సూర్యకాంతి అక్క‌డ చాలా తక్కువగా ప‌డుతుంది. జెఫ్ క్యాప్స్ అనే ఫోటోగ్రాఫర్ సాహ‌సం చేసి అంటార్కిటికాలోని దక్షిణ ధృవంలో చ‌లి ప‌రిస్థితిని చిత్రీక‌రించారు. ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా గంట‌ల వ్య‌వధిలోనే 20 ల‌క్ష‌ల మంది చూశారు.


“ఇక్కడ దక్షిణ ధ్రువం వద్ద ఉష్ణోగ్రత -84 డిగ్రీల ఫారెన్‌హీట్-64 డిగ్రీల సెల్సియస్ ఉన్న‌ది. బీర్ క్యాన్ నుంచి గ్లాస్‌లో పానియం పోస్తుండ‌గా, అది గ‌డ్డ‌క‌ట్టి పోయింది. బీరులోని పదార్థాలు సగం వరకు నిలిచిపోయాయి. దక్షిణ ధృవం మొత్తం మంచుతో కప్పబడి ఉన్న‌ది“ అని క్లిప్ జెఫ్ పేర్కొన్నారు. ద‌క్షిణ ధ్రువానికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌గా నిమిషాల్లోనే ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి.

Latest News