Rajasthan | మేన‌కోడ‌లి పెళ్లికి రూ. 3 కోట్ల క‌ట్న‌మిచ్చిన మేన‌మామ‌లు.. ఇది ఆచార‌మ‌ట‌..!

Rajasthan | పెళ్లి( Marriage ) అన‌గానే మొద‌ట‌గా గుర్తు వ‌చ్చేది క‌ట్నం( Dowry ). ఎంత క‌ట్నం ఇస్తారు. ఏం కానుక‌లు స‌మ‌ర్పిస్తారు. ఈ విష‌యాలు మాట్లాడుకున్న త‌ర్వాతే ఇతర‌ సంప్ర‌దాయాలు మొద‌ల‌వుతాయి. ఇక మేన‌మామ‌ల( Maternal Uncles ) క‌ట్నం కూడా ముఖ్య‌మే. మేన‌కోడ‌లి( niece ) పెళ్లికి మేన‌మామ‌లు కూడా త‌మ స్థాయికి త‌గ్గ క‌ట్నకానుక‌లు స‌మ‌ర్పిస్తారు. కానీ ఈ మేన‌మామ‌లు మాత్రం తమ స్థాయికి మించి మేన‌కోడ‌లికి క‌ట్నం ఇచ్చారు. ఏకంగా […]

  • Publish Date - March 18, 2023 / 09:34 AM IST

Rajasthan | పెళ్లి( Marriage ) అన‌గానే మొద‌ట‌గా గుర్తు వ‌చ్చేది క‌ట్నం( Dowry ). ఎంత క‌ట్నం ఇస్తారు. ఏం కానుక‌లు స‌మ‌ర్పిస్తారు. ఈ విష‌యాలు మాట్లాడుకున్న త‌ర్వాతే ఇతర‌ సంప్ర‌దాయాలు మొద‌ల‌వుతాయి. ఇక మేన‌మామ‌ల( Maternal Uncles ) క‌ట్నం కూడా ముఖ్య‌మే. మేన‌కోడ‌లి( niece ) పెళ్లికి మేన‌మామ‌లు కూడా త‌మ స్థాయికి త‌గ్గ క‌ట్నకానుక‌లు స‌మ‌ర్పిస్తారు. కానీ ఈ మేన‌మామ‌లు మాత్రం తమ స్థాయికి మించి మేన‌కోడ‌లికి క‌ట్నం ఇచ్చారు. ఏకంగా రూ. 3.21 కోట్ల క‌ట్నం మేన‌కోడ‌లిపై త‌మ‌కున్న అభిమానం, ప్రేమ‌ను చాటుకున్నారు. అయితే ఇది వారి ఆచ‌ర‌మ‌ట‌.

రాజ‌స్థాన్( Rajasthan ) నాగౌర్ జిల్లా( Nagaur Dist )లోని బుర్ది గ్రామానికి చెందిన ముగ్గురు అన్న‌ద‌మ్ముళ్లు క‌లిసి త‌మ సోద‌రి కూతురి వివాహానికి రూ. 3.21 కోట్ల క‌ట్నం ఇచ్చారు. 10 ఎక‌రాల భూమి, 30 ల‌క్ష‌ల విలువ చేసే స్థ‌లం, 41 తులాల బంగారం( Gold ), 3 కేజీల వెండి( Silver ), కొత్త ట్రాక్ట‌ర్( Tractor ), ట్రాలీ నిండా వ‌డ్లు, ఒక స్కూటీ( Scooty )ని క‌ట్నం కింద ఇచ్చారు. వీటితో పాటు రూ. 80 ల‌క్ష‌ల న‌గ‌దు కూడా ఇచ్చారు. అంతే కాదు.. మేన‌కోడ‌లి గ్రామంలోని ప్ర‌తి కుటుంబానికి ఒక వెండి నాణెం ఇచ్చి త‌మ గొప్ప మ‌న‌సును చాటుకున్నారు.

ఇది ఆచార‌మ‌ట‌..!

నాగౌర్ జిల్లాలోని మైరా( Myra ) తెగ‌కు చెందిన వారు ఈ ఆచారాన్ని కొన్నేండ్ల నుంచి పాటిస్తున్నార‌ట‌. అయితే మేన‌కోడ‌లి, మేన‌కోడ‌లు పెళ్లి అయితే క‌చ్చితంగా మేన‌మామ‌లు వారి తెగ సంప్ర‌దాయం ప్ర‌కారం.. క‌ట్న‌కానుక‌లు స‌మ‌ర్పించాల్సిందేన‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ క‌ట్నం కింద మేన‌మామ‌లు రూ. కోటి వ‌ర‌కు స‌మ‌ర్పించార‌ట‌. కానీ ఈ ముగ్గురు అన్న‌ద‌మ్ముళ్లు క‌లిసి రూ. 3 కోట్ల క‌ట్నం ఇవ్వ‌డం నాగౌర్ జిల్లాలోనే రికార్డును బ్రేక్ చేసిందని స్థానికులు చెబుతున్నారు.

Latest News