అభివృద్ధిలో అగ్రభాగాన మెదక్ జిల్లా

రాష్ట్రంలో మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంచనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు.

  • Publish Date - January 26, 2024 / 04:35 PM IST

  • ఘనంగా గణతంత్ర వేడుకలు
  • మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో
  • కలెక్టర్ రాజర్షి షా పతాకావిష్కరణ

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో మెదక్ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉంచనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ బాలస్వామి, జిల్లా అధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెదక్ జిల్లా సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. జిల్లాలో మహాలక్ష్మి పథకంలో నిత్యం 62 మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ప్రజాపాలన, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ, గృహజ్యోతి, చేయూతతో పాటు వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు 126 రకాల వ్యాధులకు జీవితకాలమందులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.


ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సన్మానించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద, ఎస్పీ డాక్టర్ బాలస్వామి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా, డివిజన్, మండల, వివిధ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Latest News