Site icon vidhaatha

Medak | ఆఖరి మజిలీకీ తప్పని వరద కష్టాలు.. ఉధృత వాగును దాటించి.. అంత్యక్రియలు

Medak

విధాత, మెదక్: ఒకవైపు అంత్యక్రియల కోసం మృత‌దేహంతో ప్రయాణం.. ఇంకోవైపు ఎదురుగా ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు.. అయినా శాస్త్రోక్త అంత్యక్రియలకే మొగ్గు చూపిన కుటుంబ సభ్యులు, బంధువులు సాహసోపేతంగా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వాగును దాటి చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు పూర్తి చేశారు.

సిద్దిపేట జిల్లా చేర్యాలలో భారీ వర్షాల వల్ల వాగు ఉప్పొంగింది. అయితే గ్రామానికి చెందిన చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల నిర్వహణకు శ్మశాన వాటికకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. అందుకే వారంతా మృత‌దేహాన్ని మోస్తు కొందరు, పరస్పరం చేతులు పట్టుకుని మరికొందరు జాగ్రత్తగా వాగును దాటేశారు. ఈ సాహస అంతిమయాత్ర వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version