Site icon vidhaatha

AP Govt | ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. పాఠ‌శాల‌ల్లో మొబైల్ ఫోన్ల వాడ‌కంపై నిషేధం

AP Govt |

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మొబైల్ ఫోన్ల వాడ‌కంపై ఏపీ పాఠ‌శాల విద్యాశాఖ నిషేధం విధించింది.

ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పాఠ‌శాల‌ల‌కు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవ‌డంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది.

టీచ‌ర్లు సైతం క్లాస్ రూమ్‌ల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్ష‌లు విధించింది ప్ర‌భుత్వం. ఉపాధ్యాయులు క్లాస్ రూమ్‌ల‌కు వెళ్లే ముందు త‌మ మొబైల్స్‌ను ప్రిన్సిప‌ల్‌కు అప్ప‌గించాల‌ని సూచించింది.

యునెస్కో విడుద‌ల చేసిన గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ మానిట‌రింగ్ రిపోర్ట్ ఆధారంగా, బోధ‌న‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విద్యాశాఖ స్ప‌ష్టం చేసింది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇత‌ర వ‌ర్గాల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పాఠ‌శాల విద్యాశాఖ తెలిపింది.

అయితే నింబంధ‌న‌లు ఉల్లంఘించిన ఉపాధ్యాయుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ నిబంధ‌న‌లు అమ‌ల‌య్యేలా చూడాల‌ని స్కూల్స్ ప్రిన్సిప‌ల్స్, పైస్థాయి అధికారుల‌ను ఆదేశించింది.

Exit mobile version